టాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా జైలర్ సినిమాతో హిస్టారికల్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. 70 ఏళ్ల వయసుకు చేరువ అవుతున్న వేళ రజనీకాంత్ పని అయిపోయిందని విమర్శలు వస్తున్న సమయంలో జైలర్ తో తిరుగేలేని బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకుని ఈ వయసులోనూ తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు అందరు దృష్టి రజినీకాంత్ 170వ సినిమాపై ఉంది.
జై భీమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 19 నుంచి సెట్స్ మీదకు వెళ్ళనుంది. ఈ సినిమాల్లో రజిని ముస్లిం పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో తెలుగు నటులు నాని లేదా శర్వానంద్ కీలక పాత్ర పోషిస్తారని ఊహాగానాలు నిన్న మొన్నటి వరకు వచ్చాయి.
అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం రానా దగ్గుబాటి ఈ బిగ్గెస్ట్ సినిమాలో రజనీకాంత్ తో స్క్రీన్ పంచుకునే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. దీనిపై త్వరలోనే అధికారికి ప్రకటన రానుంది. ఈ సినిమాల్లో రానా పాత్ర వివరాలను చాలా సీక్రెట్ గా ఉంచుతున్నారు. ఈ సినిమాలో మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ తో పాటు మంజు వారియర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఈ ప్రాజెక్టుని నిర్మిస్తోంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.