Moviesకెరీర్ లో ఫస్ట్ టైం చిరు ని ఎదిరించిన చరణ్.. అది...

కెరీర్ లో ఫస్ట్ టైం చిరు ని ఎదిరించిన చరణ్.. అది కూడా దాని కోసమే.. ఫ్యాన్స్ సైతం షాక్..!!

ఎస్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా సినిమాలపరంగా టాప్ గా ఉన్నప్పటికీ ఫ్యామిలీ పరంగా కూడా మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు టాప్ పొజిషన్లోనే ఉండేవాడు . అంతే కాదు కూతుర్ల విషయం ఎలా ఉన్నా కొడుకు విషయంలో మాత్రం మెగాస్టార్ ది పర్ఫెక్ట్ అంటూ మెగా ఫ్యాన్స్ కూడా ట్యాగ్ ఇచ్చేసేవారు .

అయితే ఫస్ట్ టైం మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవిని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎదిరించారు. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. మనకు తెలిసిందే.. రామ్ చరణ్ చెల్లెల్ని ..అక్కని బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా వాళ్లు లైఫ్ లో ముందుకెళ్లడానికి సహాయపడుతూ ఉంటారు. అయితే నిహారిక డివోర్స్ తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలని చూస్తుందట.

నాగబాబు కూడా మొదటిగా దీనికి ఒప్పుకోకపోతే వరుణ్ తేజ్ దగ్గర నుండి ఒప్పించారట . అయితే ఎంతమంది ఒప్పుకున్న మెగాస్టార్ చిరంజీవి మాత్రం దీనికి నో అంటున్నారట . ఈ క్రమంలోనే చాలా టైం వెయిట్ చేసిన చరణ్.. చిరంజీవి పై ఫస్ట్ టైం ఫైర్ అయ్యారట . “నిహారిక లైఫ్ నిహారిక ఇష్టం ..ఏది మంచి ఏది చెడు అనేది ఆమెకు తెలుసు .. తన లైఫ్ తన డీల్ చేసుకోగలదు.. ఒకవేళ మిస్టేక్ చేస్తే ఖచ్చితంగా తను ఆ మిస్టేక్ నుంచి బయటకు వస్తుంది .. తనేం చిన్నపిల్ల కాదు తన లైఫ్ తనను బతకనివ్వండి ” అంటూ కూసింత సీరియస్ గానే చెప్పుకొచ్చారట. అయితే ఇన్నాళ్లు తనని ఎదిరించని కొడుకు ఒక్కసారిగా ఎదిరించడంతో ఆ మాటల్లో నిజాయితీ ఉండటంతో మెగాస్టార్ చిరంజీవి సైతం ఆ మాటలను అర్థం చేసుకున్నారట . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news