Moviesరామ్ కోసం కత్తి లాంటి ఫిగర్ ని పట్టిన పూరీ..టాప్ టూ...

రామ్ కోసం కత్తి లాంటి ఫిగర్ ని పట్టిన పూరీ..టాప్ టూ బాటమ్ చూసేకొద్ది చూడాలి అనిపించే హీరోయిన్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ హీరోగా పేరు సంపాదించుకున్న రామ్ పోతినేని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సినిమా డబుల్ ఇస్మార్ట్ . గతంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా తెరకెక్కబోతుంది. ఈ డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. కాగా హిట్ కోసం ఎంతో పరితపిస్తున్న పూరి జగన్నాథ్ ఈ సినిమాకు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. అయితే ఇలాంటి క్రమంలోని సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారింది .

పూరి జగన్నాథ్ డైరెక్షన్లో రామ్ హీరోగా తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాలో హీరోయిన్ ని ఇప్పటివరకు ప్రకటించలేదు . అయితే గతంలో లాగే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు అని మాత్రం ప్రచారం జరుగుతుంది . వాళ్లలో ఒకరుని ఇప్పుడు సెలెక్ట్ చేశారట. ఆ బ్యూటీ మరెవరో కాదు సారా అలీ ఖాన్ . బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ ను ఈ సినిమాలో హీరోయిన్గా చూస్ చేసుకున్నారట మేకర్స్ .

బాలీవుడ్ మీడియా నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ఆమె ఆల్మోస్ట్ ఆల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. అంతేకాదు సెకండ్ హీరోయిన్గా జాన్వి కపూర్ ని అనుకుంటున్నారు అంటూ టాక్ వైరల్ అవుతుంది . మరోపక్క తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య కూడా ఈ రోల్ కోసం తాపత్రయపడుతుంది. చూద్దాం మరి ఇద్దరిలో ఎవరు సెలెక్ట్ అవుతారో.. సార్ అలీఖాన్ మాత్రం ఫిక్స్ అయిపోయింది అంటూ గట్టిగా వార్తలు వినపడుతున్నాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news