Moviesప్ర‌భాస్ ఆ పార్ట్‌కు స‌ర్జ‌రీ… అందుకే విదేశాల‌కు…!

ప్ర‌భాస్ ఆ పార్ట్‌కు స‌ర్జ‌రీ… అందుకే విదేశాల‌కు…!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ప్రభాస్ చాలా కాలం నుంచి మోకాలి సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ నొప్పి తీవ్రం కావడంతో ఇప్పుడు సర్జరీ అవసరమైనట్టు తెలుస్తోంది. అందుకే ప్రభాస్ యూకే బయలుదేరారు. ఆదివారమే ప్ర‌భాస్ యూకే వెళ్లిన‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల‌ ద్వారా తెలిసింది. ఈ వారంలోనే ప్రభాస్ మోకాలికి సర్జరీ జరగబోతుంది.

ఆపరేషన్ అయిన తర్వాత మరో 15 రోజుల పాటు ప్రభాస్ అక్కడే ఉంటారని.. ఆ తర్వాత స్వదేశానికి తిరిగి వస్తారని తెలుస్తోంది. ఇక్కడకు వచ్చాక కూడా నెలరోజులపాటు ఆయనే ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నారు. ఇప్పుడే ఆయన నటిస్తున్న సలార్ సినిమా షూటింగ్ పనులు అన్ని పూర్తయ్యాయి. ఆ త‌ర్వాతే స‌లార్ ప్రమోషన్ల కోసం ప్రభాస్ అందుబాటులోకి వస్తారు.

ఆ తర్వాత మారుతి – ప్రభాస్ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది. ప్రభాస్ – మారుతి కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రభాస్ లేకుండానే కొన్ని కీలకమైన సన్నివేశాలను మారుతి చకచక పూర్తి చేస్తున్నారు. సినిమా షూటింగ్ కూడా చాలా వరకు పూర్తయింది. ఏది ఏమైనా వచ్చే ఏడాది వరుసగా ప్రభాస్ సినిమాలు రిలీజ్ కానున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news