Movies' స‌లార్ ' ఈ డేట్ ప‌క్కా రాసి పెట్టుకోండి… రిలీజ్...

‘ స‌లార్ ‘ ఈ డేట్ ప‌క్కా రాసి పెట్టుకోండి… రిలీజ్ ఫిక్స్‌…!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా.. సెన్సేషనల్ మాస్ దర్శ‌కుడు ప్రశాంత్ నీల్ తెర‌కెక్కించిన బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ సలార్. వాస్తవంగా ఈ సినిమా ఈ సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా మరింత క్వాలిటీ గా వచ్చేందుకు మేకర్స్ సలార్‌ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అనధికారికంగానే సలార్ సినిమా వాయిదా అనేది కన్ఫర్మ్ అయింది.

అయితే ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది సస్పెన్స్ గా మారింది. ఇది మినహా మిగిలిన భారీ సినిమాలో డేట్లు కూడా వరుసగా వచ్చేస్తున్నాయి. ఇక సలార్ కొత్త డేట్ సహా అసలు రిలీజ్ ఉందా లేదా ? అనేది మరింత సస్పెన్స్ ప్రశ్నగా మారింది. విశ్వసినీయ‌ వర్గాల సమాచారం ప్రకారం నవంబర్ 10 న సలార్‌ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని మేకర్స్ గట్టిగా ఫిక్స్ అయి ఉన్నట్టు తెలుస్తోంది.

కేజీఎఫ్ సిరీస్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా కని వినీఎరుగని రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ కి జోడిగా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాకు ర‌వి బ్ర‌సూర్ సంగీతం అందిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news