బాహుబలి సిరీస్ సినిమాల తర్వాత ప్రభాస్‌కు అంతగా కాలం కలిసి రాలేదు. ప్రభాస్ నటించిన మూడు సినిమాలు ప్రేక్షకుల అంచనాలు అందుకోలేదు. అయితే ప్రభాస్ తాజాగా నటించిన సలార్ సినిమాపై దేశవ్యాప్తంగా కనివినీ ఎరుగని రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. కేజిఎఫ్ సిరీస్ సినిమాలతో నేషనల్ వైడ్‌గా సూపర్ పాపులర్ అయిన ప్రశాంత్ నీల్ ఈ సినిమా దర్శకుడు కావడంతో కచ్చితంగా సలార్ డైనోసార్‌లా బాక్సాఫీస్ పై గర్జిస్తుందని అటు సినీ అభిమానులు ఇటు ట్రేడ్ వర్గాలు పూర్తి కాన్ఫిడెన్స్‌తో ఉన్నాయి.
అయితే సలార్ సినిమా రిలీజ్ విషయంలో నిర్మాతలు చేస్తున్న తప్పిదాలతో తెలుగు సినిమాల నిర్మాతలు గింగిరాలు తిరుగుతున్నారు. ఇప్పుడు తెలుగు సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సలార్‌కు మనస్ఫూర్తిగా సహకరించే పరిస్థితి లేదు. సలార్ సినిమా రిలీజ్ విషయంలో నిర్మాతలు అయిన హంబలే ఫిలింస్ ఏది ముందుగా చెప్పటం లేదు. సలార్ ముందుగా సెప్టెంబర్ 28 రిలీజ్ అన్నారు. కనీసం ఈ సినిమా వాయిదా వేస్తున్నట్టు కూడా చెప్పలేదు.
దీంతో మన సినిమాలు అన్ని ఒక్కసారిగా డేట్లు వదిలేశాయి. సెప్టెంబర్ 28న – అక్టోబర్ 6న చాలా తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు కొత్తగా సలార్ రిలీజ్ డిసెంబర్ 22 అంటున్నారు. అయితే అదే టైంకు ప్లాన్ చేసుకున్న మూడు తెలుగు పెద్ద సినిమాల నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. నితిన్ తన ఎక్స్ ట్రా ఆర్డినరీ సినిమాను డిసెంబర్ 9 కి జరపాలనుకుంటున్నాడు.
వెంకటేష్ సైంధవ సినిమా డిసెంబర్ 22 అనుకున్నది కాస్త సంక్రాంతి లేదా ఫిబ్రవరి కి వెళ్లే ఆలోచనలో ఉంది. నాని తన హాయ్ నాన్న సినిమాను డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 7కు ప్లాన్ చేస్తే బెటర్ అనుకుంటున్న పరిస్థితి. ఇప్పటికే సంక్రాంతి కిక్కిరిసిపోయి ఉంది. గుంటూరు కారం – హనుమాన్ – ఫ్యామిలీ స్టార్ – ఈ గిల్ సినిమాలు ఉండనే ఉన్నాయి.
ఏది ఏమైనా సలార్ సినిమా నిర్మాతలు ఇలా పదేపదే రిలీజ్ డేట్లు మార్చుకోవటం.. చెప్పకపోవడం చేస్తుంటే తెలుగు సినిమా డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు నుంచి సలార్ సినిమాకు పెద్దగా సహకారం ఉండే పరిస్థితి అయితే లేదు. అయితే ఇది అంతిమంగా ప్రభాస్ కు ఇబ్బందిగా మారింది.