Newsఆ ఇద్ద‌రి హీరోల‌కు వార్నింగ్ ఇచ్చిన ప్ర‌భాస్‌... ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌..!

ఆ ఇద్ద‌రి హీరోల‌కు వార్నింగ్ ఇచ్చిన ప్ర‌భాస్‌… ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌..!

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా యాక్ష‌న్ డ్రామా స‌లార్‌. అన్ని అనుకున్న‌ట్టు కుదిరితే నిన్న స‌లార్ ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి ఉండాలి. ఈ పాటికి ఎక్క‌డ చూసినా.. ఎటు చూసినా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న భార‌తీయులు అంద‌రూ స‌లార్ మానియాలో మునిగి తేలుతుంటారు.

అయితే స‌డెన్‌గా స‌లార్ డేట్ ప్ర‌క‌టించి వాయిదా వేశారు. క‌నీసం సెప్టెంబ‌ర్ 28 న సినిమా రిలీజ్ కావ‌డం లేద‌ని మేక‌ర్స్ ముందు కూడా చెప్ప‌లేదు. దీంతో ప్ర‌భాస్ అభిమానుల‌తో పాటు ఈ సినిమా కోసం పాన్ ఇండియా లెవ‌ల్లో వెయిట్ చేస్తోన్న అంద‌రూ తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు. ఈ రోజు మేక‌ర్స్ స‌లార్ కొత్త రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు.

డిసెంబ‌ర్ 22న ఈ డైనోసార్ స‌లార్ బాక్సాఫీస్ మీద గ‌ర్జించ‌డానికి రెడీ అవ్వ‌బోతోంద‌ని క్లారిటీ ఇచ్చేశారు. వీళ్ల మాత్రానికి వీళ్లు రిలీజ్ డేట్ ఏసేశారు. అయితే అదే టైంకు నాని, వెంక‌టేష్ సినిమాలు ఉన్నాయి. వెంక‌టేష్ సైంధ‌వ సినిమా డిసెంబ‌ర్ 22 డేట్ వేసుకుని ఏనాడో కూర్చొంది. ఇప్పుడు తాము వ‌స్తున్నాం.. మీరు త‌ప్పుకోండంటూ సైంధ‌వ సినిమాకు స‌లార్ వార్నింగ్ ఇచ్చిన‌ట్టుగా ఉంది.

ఎలాగూ స‌లార్ సినిమాకు పోటీ వెళ్లే సాహ‌సం వెంకీ సినిమా మేక‌ర్స్ చేయ‌లేరు. ఇక మిగిలిందేంటంటే సైలెంట్‌గా సైంధ‌వ‌ను ఆ డేట్ నుంచి త‌ప్పించేయ‌డ‌మే అంత‌కు మించి చేయ‌డానికేం లేదు. నానితో పాటు స‌లార్‌కు వారం రోజుల ముందుగా రావాల‌నుకుంటోన్న నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ సినిమాను కూడా పోస్ట్‌పోన్ చేసుకోవాల్సిందే.

ఏదేమైనా స‌లార్ మేక‌ర్స్ ఇష్టం వ‌చ్చిన‌ట్టుగా రిలీజ్ డేట్లు వేయ‌డం.. వాయిదాలు వేస్తూ కొత్త డేట్లు పెట్ట‌డం టాలీవుడ్‌లో అంద‌రికి ఇబ్బందిగా మారింది. పైకి చెప్ప‌క‌పోయినా స‌లార్ మేక‌ర్స్‌పై టాలీవుడ్ అంతా గుస్సాగా ఉంది. స‌లార్‌లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, పృధ్వీ రాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి కేజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news