పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. పవన్ ఎన్ని సినిమాలలో నటిస్తున్న అప్పుడెప్పుడో రెండేళ్ల క్రితం ప్రారంభమైన హరిహర వీరమల్లు పీరియడ్ సినిమా మాత్రం ఎప్పుడు ?పూర్తవుతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో అస్సలు తెలియడం లేదు. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లాక పవన్ నటించిన భీమ్లా నాయక్ – బ్రో సినిమాలు రిలీజ్ అయిపోయాయి. ఇక ఓజీ – ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు లైన్లో ఉన్నాయి. హరిహర వీరమల్లుకు మాత్రం ఎప్పుడు మోక్షం కలుగుతుందో తెలియటం లేదు.
శ్రీ సూర్య మూవీస్ బ్యానర్‌పై తనకు ఖుషి లాంటి బ్లాక్బస్టర్ హిట్ సినిమా ఇచ్చిన ఏఎం. రత్నం ఈ సినిమాకు నిర్మాత. ఇప్పటికే ఆయన భారీగా ఖర్చు చేశారు ఈ పీరియాడికల్ సినిమా కోసం కోట్లాది రూపాయల ఖర్చు చేసి సెట్లు వేశారు. నిర్మాత రత్నం ఆ సెట్లు అలాగే ఉంచేందుకు అద్దెల మీద అద్దెలు కడుతూ ఫైనాన్షియర్ దగ్గర వడ్డీలు కట్టలేని పరిస్థితి. రత్నం పవన్ కళ్యాణ్ తన సినిమాకు ఎప్పుడు కాల్ సీట్లు ఇస్తారా ? అని ఎదురు చూసి కళ్ళు కాయలు కాచిపోయాయి.
తాజాగా ఆయన తనయుడు డైరెక్ట్ చేసిన రూల్స్ రంజన్ ప్రెస్‌మీట్ సందర్భంగా హరిహర వీరమల్లు గురించి ఆయన మాట్లాడారు. పవన్ సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉన్నారు. వీరమల్లు పీరియాడికల్ డ్రామా కావడంతో సెట్స్ వేయడానికి చాలా సమయం పడుతుంది. ఈ యేడాది నాటికి షూటింగ్ మొత్తం పూర్తిచేసి ఎన్నికల లోపు సినిమా విడుదల చేయాలని అనుకుంటున్నారు ఆయన చెప్పారు.
రత్నం కక్కలేక మింగలేక ఈ మాట చెప్పినట్టు క్లియర్గా తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వచ్చే ఏడాది మే వరకు పవన్ ఎంత వరకు కాల్ సీట్లు ఇస్తారన్నది క్లారిటీ లేదు. అసలు ఉస్తాద్ భగత్ సింగ్‌కే దిక్కు లేకుండా పోయింది. ఈ టైంలో వీరమలు సినిమాకు పవన్ కాల్ సీట్లు ఇస్తాడని నిర్మాత రత్నం ఆశించటం.. ఆ సినిమా వచ్చే ఏడది సమ్మర్లో రిలీజ్ అవుతుందని అనుకోవటం అత్యాశే. రత్నం ఎంత ఆవేదనతో మాట్లాడుతున్నారో చెప్పక్కర్లేదు.