Moviesకష్టపడి త్రివిక్ర‌మ్ క‌థ చెప్తుంటే.. విని నిద్ర‌పోయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఆ...

కష్టపడి త్రివిక్ర‌మ్ క‌థ చెప్తుంటే.. విని నిద్ర‌పోయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఆ బ్లాక్ బస్టర్ సినిమా ఇదే..!!

ఎస్ .. అవునండి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు పవన్ కళ్యాణ్ ఎంత మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం మనకు బాగా తెలుసు. పవన్ కళ్యాణ్ సినిమాల పరంగా ముందుకు వెళ్లాలంటే కచ్చితంగా త్రివిక్రమ్ సలహా తీసుకుంటారు అన్న కామెంట్స్ ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని అనఫీషియల్ గా బోలెడు ఇంటర్వ్యూస్ లో పవన్ కళ్యాణ్ సైతం ఒప్పుకున్నాడు. మరి అలాంటి జాన్ జిగిడి దోస్త్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు పవన్ కళ్యాణ్ కు కథ చెప్తూ ఉంటే హ్యాపీగా నిద్రపోయాడట .

ఆ సినిమా మరేదో కాదు అతడు . ఎస్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన ఫస్ట్ సినిమా ఇది. జయభేరి ఆర్ట్స్ పతాకంపై డి కిషోర్ -ఎమ్ రామ్మోహన్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . అయితే ఈ సినిమాలో మొదటగా హీరోగా పవన్ కళ్యాణ్ అనుకున్నారట త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు . ఇదే విషయం ఆయనకి చెప్పి కథ వివరిస్తూ ఉండగా .. ఆయన మాత్రం హ్యాపీగా నిద్రపోయారట .

త్రివిక్రమ్ ఆ విషయం చూసుకోకుండా కథ మొత్తం వివరించేసారట .. లాస్ట్ లో త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ వైపు చూడగ నిద్రపోతున్నాడు .. ఇది చూసి త్రివిక్రమ్ గట్టిగా నవ్వుకున్నారట. కానీ ఆ తర్వాత చాలా హర్ట్ అయ్యారట . దీంతో పవన్ కళ్యాణ్ కు ఈ కథ నచ్చలేదు అని గ్రహించి ఆయన ఆ తర్వాత నాని సినిమాలో షూటింగ్లో బిజీగా ఉన్న మహేష్ బాబును కలిసి ఈ కథను వివరించగా ఆయన యాక్సెప్ట్ చేసి సైన్ చేశాడు . అతడు సినిమా మహేష్ బాబు కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news