టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అల వైకుంఠపురంలో సినిమాతో నాన్ బాహుబలి రికార్డులకు చెక్ పెట్టిన అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ దక్కించుకున్నాడు. తాజాగా పుష్ప సినిమాలో బన్నీ నటనకు గాను జాతీయ నటుడిగా అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీ అభిమానులు వర్సెస్ బన్నీ మధ్య పెద్ద యుద్ధం జరుగుతుంది.
తాజాగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు జరుపుకున్నారు. బన్నీ రుద్రమదేవి సినిమా ఫంక్షన్ నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను కెలుకుతూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు బన్నీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పకపోవడంతో బన్నీని మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఒక ఆటాడుకుంటున్నారు. రెండు రోజుల వరకు సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉన్న బన్నీ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున కనీసం విష్ చేయకుండా మౌనం వహించారు.
పవన్ పుట్టిన రోజుకు కొన్ని రోజులు ముందే బన్నీకి నేషనల్ అవార్డు వచ్చింది. దీంతో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్‌ను ప్రత్యేకంగా అభినందిస్తూ జనసేన పార్టీ అధికారిక ఖాతా ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. దీంతో బన్నీ తీరుపై మెగా అభిమానులు దారుణంగా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. బన్నీ పెద్ద అవకాశవాది అంటూ.. నేషనల్ అవార్డు రావడంతో బిల్డప్ ఎక్కువైంది.. ఏరు దాటాక తెప్ప తగలేసే రకం అంటూ ఘోరమైన కామెంట్లు పెడుతున్నారు.
చిరు ఫ్యామిలీ కాకపోయి ఉంటే అసలు బన్నీ సినిమా హీరో అయినా అతడిని ఎవరూ పట్టించుకునే వారే కాదని.. కేవలం బన్నీని చిరు ఫ్యామిలీ హీరోగానే గుర్తించారని.. ఇప్పుడు క్రేజ్ వచ్చాక బన్నీ గర్వంతో విర్రవీగుతున్నాడని మెగా అభిమానులు విరుచుకుపడుతున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ పుట్టినరోజున బన్నీ విష్ చేయకపోవడం పెద్ద కాంట్రవర్సీకి దారితీసింది.