Moviesఈ హాట్ బేబీ ప‌వ‌న్ ఐటెం భామ‌… ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..!

ఈ హాట్ బేబీ ప‌వ‌న్ ఐటెం భామ‌… ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..!

పవర్ పవన్ కళ్యాణ్ కి జోడిగా ఎన్నో సినిమాలలో ఎంతో మంది హీరోయిన్లుగా నటించారు. అలాగే పవన్ సినిమాలలో కొందరు ఐటమ్ సాంగ్‌ల‌లో కూడా కనిపించారు. అలా పవన్ కళ్యాణ్ నటించిన గుడుంబా శంకర్ సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించిన ఒక భామ. ఆ సినిమా వచ్చి కూడా 17 సంవత్సరాలు అవుతుంది. గుడుంబా శంకర్ సినిమా తర్వాత మధ్యలో రెండు మూడు సినిమాలలో ఆమె నటించిన అనుకున్నంత గుర్తింపు రాలేదు.

అయితే చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఆ ఐటెం భామ‌ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి గుడుంబా శంకర్ సినిమాలో పవన్ కు జోడిగా మీరాజాస్మిన్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో కిల్లి కిల్లి అనే పాట అప్పట్లో బాడీని మాస్ ఆడియన్స్‌ను ఒక ఊపు ఊపేసింది. ఈ సినిమాలో పవన్ తో పాటు చిందులేసిన ఒక అమ్మాయి కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

ఆ అమ్మాయి ఎవరో కాదు ? నతన్య సింగ్. ఈ సినిమా తర్వాత ఆమె చిరంజీవి శంకర్ దాదా ఎంబిబిఎస్ తో పాటు మోహన్ బాబు శివ శంకర్ సినిమాలలోనూ కనిపించింది. ఈ సినిమాలేవి సక్సెస్ కాలేదు. దీంతో ఆ తర్వాత ఆమె టాలీవుడ్‌కు దూరమైంది. అయితే కన్నడంలో మాత్రం ఆమె స్టార్ హీరోయిన్ అయింది.

అక్కడ స్టార్ హీరోలు ఉపేంద్ర – సుదీప్ – శివరాజ్ కుమార్ లాంటి వాళ్ళతో నటించింది. 2008లో ఉపేంద్ర హీరోగా నటించిన బుద్ధివంత సినిమాలో ఆమె కీలక పాత్రలో కనిపించింది. అయితే చాలా రోజుల తర్వాత ఆమె హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వయసులో కూడా అమ్మడు అదిరిపోయే ఫిజిక్ మెయింటెన్ చేస్తుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news