Moviesమరోసారి రష్మిక తో రొమాన్స్ చేయబోతున్న విజయ్ దేవరకొండ.. ఆ హిట్...

మరోసారి రష్మిక తో రొమాన్స్ చేయబోతున్న విజయ్ దేవరకొండ.. ఆ హిట్ డైరెక్టర్ తోనే సినిమా..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబోలకు పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. వాటిల్లో ఒకటే రష్మిక మందన్నా – విజయ్ దేవరకొండ. ఈ ఇద్దరు కలిసి గీతాగోవిందం అనే సినిమాలో ఫస్ట్ టైం నటించారు . ఈ సినిమాని యాక్సెప్ట్ చేశారో తెలియదు కానీ ఈ సినిమాలో వీళ్ళిద్దరి రొమాన్స్ చూసాక వీళ్ళిద్దరికీ కెమిస్ట్రీ చూశాక అభిమానులు ఫుల్ ఫిదా అయిపోయారు. ఎంతలా అంటే విజయ్ దేవరకొండ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్నానే పెట్టాలి అంటూ వీళ్ళ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

కాగా రీసెంట్ గా రిలీజ్ అయిన ఖుషి సినిమాలో కూడా మొదటగా హీరోయిన్గా రష్మిక అని అనుకున్నారట . కానీ ఎంతసేపు ఒకటే జంటని చూపిస్తే బోర్ కొడుతుంది అన్న కాన్సెప్ట్ లో శివ నిర్వాణ హీరోయిన్ సమంత ని చూజ్ చేసుకున్నారు అంటూ తెలుస్తుంది . కాగా ఇలాంటి క్రమంలోనే మరోసారి ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న కాంబో సెట్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

పరశురాంపెట్ల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుంది . అయితే మరో హీరోయిన్గా రష్మిక మందన్నా ను ఫైనలైజ్ చేసుకున్నారట మేకర్స్. ఆల్రెడీ హిట్ కాంబో కాబట్టి.. సినిమాకి ఇంకొంచెం ప్లస్ అవుతుంది అని.. పైగా ఇప్పుడు ఉన్న టాప్ హీరోయిన్స్ లలో రష్మిక కూడా ఒకరు ..అందుకే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారట . మొత్తానికి మరోసారి మనం రష్మిక విజయ్ లని తెర పై చూడబోతున్నాం .. చూద్దాం ఈసారి ఈ జంట ఎలా మెప్పిస్తుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news