మెగా కోడలు ఉపాసన ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తన బిడ్డ అలనా పాలన చూసుకుంటూ ఇటు తన కుటుంబంతో సంతోషంగా గడుపుతుంది. అటు హాస్పిటల్స్ వ్యవహారాలతో పాటు వ్యాపారాలపై కూడా దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలోనే కుమార్తె జన్మించాక మొదటిసారిగా తన భర్త రామ్ చరణ్తో కలిసి ఉపాసన బయటికి వస్తున్నారు. తాజాగా ఉపాసన భర్త చరణ్‌తో కలిసి ఓ పెళ్లి వేడుక నిమిత్తం ఫారిన్ వెళ్ళినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయాన్ని ఉపాసన స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. కూతురు జన్మించాక మొదటిసారి ఫారిన్ వెళ్లడంతో వీరు ఇద్దరు ఉన్న ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఉపాసన ఫేసులో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఆమె చాలా స్టైలిష్ లుక్ లో కనిపించారు.
లైట్ పింక్ డ్రెస్ లో ఎంబ్రాయిడరీ జాకెట్ తో కూల్ స్టైలిష్ లుక్ లో ఉపాసన ఉన్నారు. ఉపాసన ధరించిన డ్రెస్ హేలీ మెంజెస్ డిజైనర్ కు సంబంధించిన పాంథర్ కాటన్ జాగ్వర్డ్. ఈ డ్రెస్ లో ఉపాసన చాలా చాలా ముచ్చటగా కనిపించారు. ఈ డ్రెస్ నిజంగానే సోషల్ మీడియాలో వైరల్ అయి అందరి దృష్టిని ఆకర్షించడంతో దీని ఖరీదు ఎంత అన్నదానిపై చర్చి నడుస్తుంది.
గూగుల్లో సెర్చ్ చేసిన దాని ప్రకారం ఈ డ్రెస్ ఖరీదు 42,317 ఉన్నట్టు తెలుస్తోంది. చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నా కూడా ఈ డ్రెస్ ఖరీదు ఏకంగా 42 వేలా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇక రామ్ చరణ్ కూడా చాలా స్టైలిష్ లుక్‌లో కూల్ గా కనిపించారు. రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజెస్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేసే సినిమాలో నటిస్తారు.