టాలీవుడ్ యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్గా సైమా అవార్డ్స్ లో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు . ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించినందుకు గాను ఆయనకు ఈ అవార్డు వరించింది. ఈ అవార్డు అందుకోవడానికి ఇండియా నుంచి దుబాయ్ కి వెళ్లిన తారక్ సైమా అవార్డ్స్ లో చాలా స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించారు .
అంతేకాదు చాలా గంభీరమైన లుక్స్ లో రెడ్ కార్ట్ పై వాక్ చేశారు . ఈ క్రమంలోనే అక్కడున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ జై ఎన్టీఆర్.. జై జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు . అయితే కొంతమంది మాత్రం సీఎం ఎన్టీఆర్ అంటూ గట్టిగ అరుస్తూ ఉండడంతో .. ఒక్కసారిగా ఫైర్ అయిపోయిన ఎన్టీఆర్ .. కోపంగా వాళ్ళ సైడ్ ఒక లుక్కేసారు. అయితే ఏమాత్రం పెదవి విప్పకుండా సైలెంట్ గానే.. తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని వెళ్లిపోయాడు.
ప్రజెంట్ ఇదే విజువల్స్ నెట్టింట్ వైరల్ గా మారాయి . కాగా ఎన్టీఆర్ మామ ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు అరెస్టు అయ్యారు. అయితే ఇప్పటివరకు ఎన్టీఆర్ స్పందించకపోవడం పై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. దీంతో ఇలాంటి టైం లోనే ఎన్టీఆర్ పై సీఎం ఎన్టీఆర్ అంటూ జనాలు కామెంట్స్ చేస్తూ ఉండడంతో ఏపీ రాజకీయాలలో ఏం జరగబోతుందో అన్న ఉత్కంఠ ఎక్కువగా నెలకొంది..!!