సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు ..జాన్ జిగిడి దోస్తులు ఉన్నారు. చాలామంది ఓపెన్ గా ఫ్రెండ్ షిప్ ను బయటకి ఎక్స్పోజ్ చేస్తూ ఉంటే ..కొంతమంది మాత్రం తమ ఫ్రెండ్షిప్ ను తమ వరకే పెట్టుకుంటూ బయటికి ఎక్కడ ఆ మేటర్ రివీల్ కాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు . ఆ లిస్ట్ లోకే వస్తారు టాలీవుడ్ మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రాంచరణ్.. యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ .
ఇద్దరు కు ఇద్దరి నటన విషయంలో ఏమాత్రం తగ్గరు. అంతే కాదు ఇద్దరు కూడా స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారే. రీసెంట్గా వీళ్ళిద్దరూ కలిసి ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో నటించి ఇండియన్ ఫిలిం హిస్టరీకి ఫస్ట్ టైం ఆస్కార్ అవార్డు తీసుకొచ్చారు . ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే తారక్ – చరణ్ బాగా క్లోజ్ అని ..బెస్ట్ ఫ్రెండ్స్ అని బయటపడింది . అంతకుముందు తారక్ – చరణ్ క్లోజ్ ..మాట్లాడుకుంటారు అంతవరకే తెలుసు. కానీ ఈ రేంజ్ లో ఫ్రెండ్షిప్ మైంటైన్ చేస్తారు అని రాజమౌళి పుణ్యమాంటూనే బయటపడింది .
ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తారక్ ..చరణ్ గురించి మాట్లాడుతూ ..”చరణ్ లాంటి బ్రదర్ నాకు దొరకడం నిజంగా చాలా అదృష్టమని ..ఆయన నటన చాలా బాగుంటుందని ..ఆయన డాన్స్ కూడా చాలా నచ్చుతుందని .. ఫ్యామిలీ పట్ల చూపించే ప్రేమ – కేరింగ్ చాలా చాలా నచ్చుతుందని చెప్పుకొచ్చారు. అంతేకాదు జెంటిల్మెన్ ..ది పర్ఫెక్ట్ హీరో అని చెప్తూ.. తారక్ అయితే ఓ విషయంలో మాత్రం చరణ్ నచ్చదని ఓపెన్ గానే చెప్పేశారు”.
“చరణ్ ఏ విషయం అయినా లోపల పెట్టుకుంటాడు కానీ ఓపెన్ అవ్వడు. ఏదైనా ఎదుటి వాళ్ళకి చెప్పాలి అనుకున్న వాళ్ళ హర్ట్ అవుతారేమో ..బాధపడతారేమో.. అని ఆ బాధను తనే దిగి మింగుతాడు అది కొన్నిసార్లు వర్కౌట్ అయినా.. కొన్నిసార్లు వర్కౌట్ అవ్వదు.. ఆ క్వాలిటీ ఆయన మార్చుకుంటే ఇంకా బాగుంటుంది” అంటూ సజెస్ట్ చేశారు . దీంతో ఈ కామెంట్స్ ను మరోసారి ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!!