Newsబెస్ట్ యాక్టర్ గా ఎన్టీఆర్.. స్టేజీ పై తారక్ చేసిన పనికి...

బెస్ట్ యాక్టర్ గా ఎన్టీఆర్.. స్టేజీ పై తారక్ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా.. నందమూరి బిడ్డా మజాకా..!!

టాలీవుడ్ యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ .. రీసెంట్గా తన నటన కు గాను సైమా అవార్డు అందుకున్నారు . ఎన్టీఆర్ రీసెంట్ గా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని కొమరం భీం పాత్రకు గాను ఆయనకు అవార్డు వరించింది . ఎన్టీఆర్ సైమా అవార్డును అందుకున్నారు . ఎన్టీఆర్ కు అత్యంత గౌరవమైన పురస్కారం లభించింది.

ఈ క్రమంలోనే ఆయన స్టేజిపై చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ ..తనకు తన అభిమానులపై ఉన్న ప్రేమను మరోసారి ప్రూవ్ చేశారు . ఆయన మాట్లాడుతూ..” కొమరం భీం పాత్ర నాకు ఇచ్చినందుకు.. నన్ను నమ్మినందుకు నా జక్కన్నకు చాలా థాంక్స్ .. ఆ కోస్టార్ మై బ్రదర్.. ఫ్రెండ్ ..రామ్ చరణ్ కు చాలా ధన్యవాదాలు.. నా అభిమానులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు . నా ఒడిదుడుకుల్లో నేను కింద పడినప్పుడల్లా నన్ను పట్టుకొని పైకి లేపినందుకు నా కళ్ళ నుండి వచ్చిన ప్రతి కన్నీటి చుక్కకూ వాళ్ళు బాధపడినందుకు..

నేను నవ్వినప్పుడు నాతో నవ్వినందుకు .. నా అభిమాన సోదరులు అందరికీ పాదాభివందనాలు చేసుకుంటున్నాను అని.. చాలా ఎమోషనల్ గా మాట్లాడారు.. ప్రజెంట్ దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది”.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news