NewsNTR క్రేజ్‌... ' దేవ‌ర ' ప్రి రిలీజ్ బిజినెస్ రికార్డుల...

NTR క్రేజ్‌… ‘ దేవ‌ర ‘ ప్రి రిలీజ్ బిజినెస్ రికార్డుల మోత‌…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన త్రిపుల్ ఆర్‌ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ డూపర్ హిట్ అయింది. ఎన్టీఆర్‌కు కెరీర్ పరంగా తొలి పాన్ ఇండియా హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగమ్మ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది.

దివంగత అతిలోక అందాల సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ తొలిసారి సౌత్ సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్న సినిమా ఇదే కావటం విశేషం. ఈ షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో మాస్ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతున్న దేవరలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. అనిరుధ్‌ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న దేవర సినిమా రిలీజ్ చేస్తున్నట్టు కొరటాల ఇప్పటికే చాలాసార్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా మొదలైంది. తాజాగా దేవర ఓటిటి రైట్స్ లాక్ చేసినట్టు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దేవ‌ర ఓటీటీ హ‌క్కులు సొంతం చేసుకుంది.

ఇందుకోసం భారీ రేటు కోడ్ చేసి మరి దక్కించుకున్నట్టు తెలుస్తోంది. దేవర రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రు. 120 కోట్ల మేర చెల్లింపులు చేసి డీల్ క్లోజ్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా దేవరపై అంచనాలు అయితే మామూలుగా లేవు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news