టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈతరం జనరేషన్ హీరోలలో నటనపరంగా ఎన్టీఆర్‌కు పోటీ వచ్చే నటుడే లేరని చెప్పాలి. తాజాగా ఎన్టీఆర్ పై బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ చేసిన కామెంట్లు ఇప్పుడు నేషనల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేసి సంచలనాలుగా మారాయి. సన్నీడియోల్ – అమీషా పటేల్ – ఉత్కర్ష శర్మ ప్రధాన పాత్రలలో నటించిన గద్దర్ 2 భారతీయ బాక్సాఫీస్ దగ్గర 500 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతోంది.
22 సంవత్సరాలు క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ గధర్ ఏక్ ప్రేమ కథకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది. తారాసింగ్, సకీనా లాంటి వారి ప్రియమైన పాత్రలలో సన్నీ మరియు అమీషా తిరిగిరావడానికి ఆస్వాదిస్తూ ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. 22 సంవత్సరాల తర్వాత కూడా వారు అదే కెమిస్ట్రీతో ప్రేక్షకుల ప్రశంసలు దక్కించుకోవడం నిజంగా గ్రేట్.
అసలు గదర్ కథ ఇప్పుడు తెరకెక్కితే ఇప్పుడున్న హీరోలలో ఎవరిని తీసుకుంటారని దర్శకుడు అనిల్ శర్మను ప్రశ్నిస్తే.. ప్రస్తుతం తరం నుంచి ఆ ఐకానిక్ క్యారెక్టర్ లోకి కేవలం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే సరిపోతాడంటూ సెన్షేషనల్ కామెంట్స్ చేశారు. అతడు మాత్రమే ఈ పాత్ర చేయగలడు.. అతడికి మాత్రమే ఈ పాత్ర చేసే సత్తా ఉందని ప్రశంసల వర్షం కురిపించేశాడు.
ఈ కామెంట్‌ను ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ చేయడంతో పాటు అనిల్ శర్మను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తోన్న దేవర వచ్చే యేడాది ఏప్రిల్ 5న పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ కానుంది.