టాలీవుడ్ ఇండస్ట్రీలో రష్మిక మందన్నా క్రేజ్ ఒకప్పుడు ఎలా ఉండిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ తన స్థాయిని సినిమా సినిమాకి పెంచుకుంటూ పోయింది .ఛలో సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఆ తర్వాత గీతాగోవిందం సినిమాలో నటించి క్రేజీ హిట్ అందుకుంది .
ఆ తర్వాత మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరూ నటించి సూపర్ డూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఆల్ టైం రికార్డ్స్ క్రియేట్ చేసిన పుష్ప సినిమాలో హీరోయిన్గా నటించి తన తల రాతనే మార్చేసుకుంది . అయితే రీసెంట్గా రష్మిక మందన్నా ఎయిర్ పోర్ట్ లో చిరిగిన ప్యాంటుతో కనిపించిన సంగతి తెలిసిందే. దీని పై జనాలు వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు .
ఈ క్రమంలోనే కొందరు ఆకతాయిలు ఆమెను ఆడేసుకుంటున్నారు . నీ ఫేస్ కి ఇలాంటి బట్టలేస్తే గాని క్రేజ్ రాదని .. నీకు పుష్ప సినిమా హిట్ పడకుండా ఉంటే అసలు నీ ఫేస్ కి సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా చేసే దానివి కాదు అని .. దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు . మరి ముఖ్యంగా విజయ్ దేవరకొండ రొమాన్స్ నే నీకు లైఫ్ ఇచ్చిందని .. ఒకవేళ నిజంగా గీతగోవిందం సినిమా నీ ఖాతాలో పడకుండా ఉంటే నీ ఫ్యూచర్ ఎలా ఉండేదో ఊహించుకో అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు..!!