హమ్మయ్య కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన మూమెంట్ రానే వచ్చేసింది. బిగ్ బాస్ సీజన్ సెవెన్ గ్రాండ్ గా మొదలైంది . మొదలయ్యి ఒకరోజు గడిచిపోయింది .. నామినేషన్స్ కూడా మొదలైపోయాయి . అప్పుడే కంటెస్టెంట్స్ పులిహోరలు కలపడం.. పుల్లలు పెట్టడం కూడా స్టార్ట్ చేశారు . మస్తు మజా వస్తుంది ఈసారి బిగ్ బాస్ అంటూ ఆడియన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు .
కాగ పెద్దగా చెప్పుకోతగ్గ కంటెస్టెంట్స్ హౌస్ లోపల లేకపోయినా కానీ లోపలికి పంపించిన కంటెస్టెంట్స్ మాత్రం మంచి గట్టి కంటెస్టెంట్స్ నే పంపారు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ అందరు టఫ్ కాంపిటీషన్ ఇచ్చే విధంగానే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని ఈసారి బిగ్ బాస్ చూస్ చేసుకుంది అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . అయితే అప్పుడే సోషల్ మీడియాలో బిగ్ బాస్ సెవెన్ విన్నర్ ఎవరు అనేది ట్రెండింగ్ గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం అందరూ హీరోయిన్ రితిక ఈసారి బిగ్ బాస్ విన్నర్ అవుతుంది అంటూ చెప్పుకొస్తున్నారు .
దానికి రీజన్ ఆమె వేసే బిగ్ బాస్ స్ట్రాటజీస్. ఇంట్లో కూర్చొని అన్ని సీజన్స్ ను బాగా పట్టేసినట్లుంది . అందుకే రకరకాల స్ట్రాటజీలతో ముందుకు వెళుతుంది . రీసెంట్గా బిగ్ బాస్ తనకు ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ను తెలివిగా టేస్టీ తేజతో చేయించి తన స్ట్రాటజీని వర్క్ అవుట్ చేసింది రితిక . ఇది చూసిన తర్వాత అందరూ రితిక మొదటి నుంచి మంచి ఆట తీరుతో ముందుకెళుతుందని . ఇదిలాగే కొనసాగితే కచ్చితంగా ఆమె విన్నర్ అవుతుందని.. అందం పరంగా కూడా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉండడంతో అటు ఆటపరంగా ఇటు గ్లామర్ టచ్ పరంగా ఈసారి రితిక టాప్ పొజిషన్లో ఉంటుందని అన్ని కుదిరితే ట్రోఫీ కూడా అందుకని బయటకు వస్తుందని చెప్పుకొస్తున్నారు . దీంతో రితిక రోజ్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!