త్రిష పెళ్లిపై ఎన్నో సంవత్సరాలుగా పుకార్లు వస్తున్నాయి. గత దశాబ్ద కాలంగా ఆమె పెళ్లి, ప్రేమపై ఎన్నో ఊహగానాలు ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు త్రిష ఖండిస్తూ వస్తోంది. కొంతమంది హీరోలతో ఆమె ప్రేమలో పడిందన్న వార్తలు తెలిసిందే. మధ్యలో పారిశ్రామికవేత్త వరుణ్ మణియన్‌తో ఆమెకు ఎంగేజ్మెంట్ జరిగాక పెళ్లి వరకు వెళ్లకుండానే అది బ్రేకప్ అయ్యింది.
తాజాగా త్రిష ఓ మలయాళీ నిర్మాతను పెళ్లాడబోతుందంటూ ప్రచారం మొదలైంది. సౌత్ నుంచి నార్త్ వరకు ఒక రేంజ్ లో దీనిపై కథనాలు వచ్చాయి. వాటిని చూస్తే ఈసారి త్రిష కచ్చితంగా పెళ్లి చేసుకుంటుందని అందరూ అనుకుంటారు. ఆ రేంజ్ లో త్రిష పెళ్లిపై ప్రచారం జరిగింది. త్రిష మామూలుగానే తన పెళ్లి పుకార్లను ఖండించింది. అయితే ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు మాత్రం సరికొత్త చర్చకు దారితీసాయి.
నువ్వు ఎవరో నీకు తెలుసు ? నీ టీం ఏంటో కూడా నీకు తెలుసు.. ఇకనైనా నిశ్శబ్దంగా ఉండు ఇలాంటి పుకార్లు ఆపు చీర్స్ అంటూ త్రిష పోస్ట్ పెట్టింది. త్రిష తన సందేశంలో ఎక్కడా పెళ్లి, ప్రేమ లాంటి పదాలు ఉపయోగించలేదు.. అయితే పెళ్లిపై వచ్చిన పుకార్లను ఖండిస్తూ చెప్పకనే చెప్పింది. త్రిష పోస్టుపై సరికొత్త చర్చ కోలీవుడ్ మీడియాలో మొదలైంది. కావాలని త్రిష పెళ్లి చేసుకోబోతుందంటూ కొందరు పుకార్లు సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని వాళ్ళకే త్రిష గట్టిగా కౌంటర్ ఇచ్చిందని అంటున్నారు.
ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్ నయనతార పేరు తెరమీదకు వస్తోంది. తనకు పెరుగుతున్న ఇమేజ్ను దెబ్బతీసేందుకు.. ఆమె వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ నయనతారకు చెందిన పిఆర్ టీం ఇలాంటి చెత్త పనులు చేస్తుంది అంటూ త్రిష అభిమానులు కొంతమంది చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలకు నయనతార తర్వాత ఆప్షన్ త్రిష మాత్రమే ఆప్షన్. వీళ్ళకు మాత్రమే అక్కడ మంచి మార్కెట్ ఉంది.
అందుకే త్రిషకు ఇమేజ్ పెరిగితే నయనతారకు వచ్చే ఇలాంటి ఛాన్సులు ఎక్కడ వెళ్ళిపోతాయో ? అని నయనతార కావాలని తన పిఆర్ టీం ద్వారా త్రిషపై ఇలాంటి లేనిపోని పుకార్లు క్రియేట్ చేస్తుందన్న గుసగుసలు, ప్రచారం కోలీవుడ్ లో గట్టిగా జరుగుతోంది. అందుకే త్రిష కూడా వాళ్ళని టార్గెట్ చేస్తూ ఇలా గట్టిగా కౌంటర్లు వేసింది అని అంటున్నారు. మరి ఇందులో అసలు నిజా నిజాలు ఏంటో త్రిష లేదా నయనతారకే తెలియాలి.