టాలీవుడ్ ఇండస్ట్రీలో జేజమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ అనుష్క తాజాగా నటిస్తున్న సినిమా “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ అయిన అప్డేట్స్ అన్ని అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. సెప్టెంబర్ 7న గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. సినిమా ప్రమోషన్స్ లో ఎక్కడ చూసినా సరే నవీన్ పోలిశెట్టి కనిపిస్తున్నాడు .. తప్పిస్తే హీరోయిన్ అనుష్క ఎక్కడ కనిపించడం లేదు .
ఈ క్రమంలోనే అనుష్కకు ఏమైంది అన్న ప్రశ్న అందరి మదిలో తడుతుంది..? కాగా కొందరు అనుష్క బాగా లావు అయిపోయిందని .. అది చూసి ఆమెను ట్రోల్ చేస్తారని.. ఆ ట్రోలింగ్ సినిమాకి నెగిటివ్గా మారకూడదు అని .. అందుకే ప్రమోషన్స్ కి రావడం లేదని చెప్పుకొస్తుంటే మరికొందరు.. అనుష్క వేరే పనిలో బిజీగా ఉందని .. అందుకే ఈ సినిమా ప్రమోషన్స్ లైట్ గా తీసుకుందని ప్రచారం చేస్తున్నారు.
మొత్తానికి అనుష్క ఎందుకు ప్రమోషన్స్ కి రావడం లేదు అన్న ప్రశ్న ఎదురైంది . నవీన్ పోలిశెట్టి తాజా ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చాడు . నవీన్ మాట్లాడుతూ ..”అనుష్క వేరే పని మీద అబ్రాడ్ లో ఉందని.. అక్కడ సినిమాని ప్రమోట్ చేస్తుందని.. త్వరలోనే ఇండియా వస్తుందని ఇక్కడ కూడా ప్రమోట్ చేస్తుందని .. ఆమె గ్రూప్ ఇంటర్వ్యూలో పాల్గొన్న వీడియో త్వరలోనే రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు “. దీంతో అసలు విషయం చెప్పకుండా నవీన్ దాట వేయడంతో అందరూ అనుకున్న మాటే నిజమైంది. అనుష్క బాగా బరువు పెరిగిపోయిందని.. ఆ కారణంగానే ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదు అని ఫిక్స్ అయిపోయారు జనాలు..!!