టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ నానికి ఎలాంటి స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎటువంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లోకి రావడమే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . కాగా రీసెంట్ గానే దసరా సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో హిట్ కొట్టి 100 కోట్ల క్లబ్ లో చేరిన ఆయన.. త్వరలోనే హాయ్ నాన్న అనే సినిమాతో పలకరించబోతున్నాడు. ఇదే క్రమంలో రీసెంట్గా మీడియాతో ఇంటరాక్ట్ అయిన నాని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు .
నాని ఇటీవల రేడియో జాకిలతో కలిసి చిట్ చాట్ నిర్వహించాడు. ఈ సందర్భంగా మీరు ప్రేమలో ఎప్పుడు పడ్డారు ..? ఎవరితో పడ్డారు..? అనే విషయాలు అడగ్గా ఆయన ఓపెన్ గా ఆన్సర్ ఇచ్చారు. నేను మూడో తరగతి చదువుతున్న టైం లోనే లవ్ లో పడ్డాను . అప్పుడు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలో సోనీ అనే అమ్మాయి మంచి ఫ్రాక్ ధరించి నా ముందుకు వచ్చింది . నేనేమో చుట్టూ ఆకులు చుట్టుకుని నిలబడ్డాను .. ఆమెను చూడగానే నా కళ్ళు ఆమె డ్రెస్ పై వెళ్ళాయి .
ఆమెను పలకరించాలి అని అనిపించింది.. కానీ ఆకులు చుట్టుకున్నానని సిగ్గుతో ఆమె దగ్గరకు కూడా వెళ్లలేదు .. ఇప్పుడు ఆ అమ్మాయి కనిపిస్తే మాత్రం అస్సలు మిస్ చేసుకోను వెళ్లి పలకరిస్తాను అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు . అంతేకాదు ప్రస్తుతం తన క్రష్ కీయరా కన్నా “హాయ్ నాన్న సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేస్తున్న పాప”. ఒకరోజు కీయరా చక్కగా రెడీ అయ్యే సెట్ కి వచ్చింది చూడగానే చాలా ముచ్చటగా అనిపించింది . ప్రస్తుతం తనే నా క్రష్ అని చెప్పుకొచ్చాడు. దీంతో సోషల్ మీడియాలో ఇదే వ్యాఖ్యలు వైరల్ గా మారాయి..!!