Moviesబన్నీ సినిమాని కాపీ కొట్టి హిట్ కొట్టిన నాని.. ఆ బ్లాక్...

బన్నీ సినిమాని కాపీ కొట్టి హిట్ కొట్టిన నాని.. ఆ బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో తెలిస్తే కడుపుమండిపోతుంది..!!

సినిమా ఇండస్ట్రీలో ఒకే కథతో వచ్చి హిట్ కొట్టిన హీరోస్ ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు అదే లిస్టులోకి ఆడ్ అయిపోయారు.. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ నాచురల్ స్టార్ హీరో నాని. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ప్రెసెంట్ పుష్ప2 సినిమాలో బిజీగా ఉన్న అల్లు అర్జున్ ఆగస్టు 15 2024వ తేదీ ఈ సినిమా ద్వారా మరోసారి అభిమానులను క్రేజీ ఫీలింగ్ కలగజేయబోతున్నాడు .

కాగా నేచురల్ స్టార్ నాని సైతం చాలా కూల్ అండ్ క్లాసిక్ సెంటిమెంటల్ స్టోర్ నాన్నతో అభిమానులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. కాగా గతంలో ఒకే కథతో వీళ్లిద్దరూ వచ్చి బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు . ఆ సినిమా మరేదో కాదు అల్లు అర్జున్ కెరియర్ లో నటించిన సీక్వెల్ సినిమా ఆర్య 2 . నాచురల్ స్టార్ నాని కెరియర్ లో ఫస్ట్ టైం పాన్ ఇండియాలో తెరకెక్కిన దసరా . ఆర్య 2 – దసరా సినిమా ఇంచుమించు ఒకేలా ఉంటుంది. స్టోరీ మొత్తం ఒక్కటే.

అంతేకాదు ఆర్య 2 సినిమాలో మొదటిగా హీరోయిన్ సెకండ్ హీరోని ఇష్టపడుతుంది.. ప్రేమిస్తుంది . ఆ తర్వాత కొన్ని కారణాల చేత ఫస్ట్ హీరోని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది . తర్వాత ప్రేమ విలువ తెలిసి ఆ ఫస్ట్ హీరోకి కనెక్ట్ అవుతుంది . ఇంచుమించు దసరా సినిమా స్టోరీ కూడా అంతే .. వెన్నెల పాత్రలో మెరిసిన కీర్తి సురేష్ మొదటగా సెకండ్ హీరోని ప్రేమిస్తుంది.. ఆయన్ని పెళ్లి చేసుకుంటుంది ..కానీ ఆయన చనిపోవడంతో నాని ఆమెను మళ్లీ పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ ఇస్తాడు ..మొదట్లో నాని అంటే ఇష్టం లేని వెన్నెల ఆ తర్వాత నాని అంటే పడి చచ్చిపోతుంది . ఇలా ఇద్దరు ఒకే కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా లు సూపర్ డూపర్ హిట్లను తమ ఖాతాలో వేసుకున్నారు . ఇంకా చెప్పాలంటే ఆర్య 2 కన్నా నాని దసరానే ఫ్యాన్స్ కి బాగా నచ్చేసింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news