మనకు తెలిసిందే టాలీవుడ్ నరసింహం నందమూరి బాలయ్య కి కొంచెం కోపం ఎక్కువే . ఉన్నది ఉన్నట్లు ముఖానే మాట్లాడేస్తాడు .. ఎదుట వారు ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే తప్పు చేస్తే స్ట్రైట్ గా అడిగడం మొదటి నుంచి బాలయ్యకు అలవాటు . అలాంటి సందర్భాలు మనం ఎన్నో తెర పై చూశాం .. తెర వెనక చూసాం ..వార్తలు విన్నాం. అయితే రీసెంట్గా బాలయ్య కోపానికి బలైపోయాడు మెగా డైరెక్టర్ బాబి . ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .
నందమూరి బాలయ్య ..బాబీ డైరెక్షన్లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భగవంత్ కేసరి సినిమా షూట్ కంప్లీట్ అవ్వగానే ఈ సినిమా సెట్స్ పైకి రాబోతుంది. అయితే బాబీ బాలయ్య కోసం కొన్ని స్పెషల్ డైలాగ్స్ రాసుకున్నారట . ఎప్పుడు చాలా పద్ధతిగా ఉండే బాబి ఈసారి కొంచెం నాటి నెస్ జోడించి చిలిపి చిలిపి డైలాగ్స్ ను ..వల్గర్ బూతులను ..డబల్ మీనింగ్ పంచెస్ డైలాగ్స్ గా రాశారట . ఈ క్రమంలోనే రీసెంట్గా బాబీ టీం ఆ డైలాగ్స్ వినిపించడానికి బాలయ్య ఇంటికి వెళ్ళగా బాలయ్య డైలాగ్స్ విని ఫుల్ ఫైర్ అయిపోయారట.
“నా సినిమాలో ఇలాంటి చెత్త డైలాగులా..?” అంటూ ఫుల్ కోప్పడి పోయారట . అంతేకాదు స్పాట్లోనే బాబీకి కాల్ చేసి మరి ఇచ్చి పడేసారట . “నువ్వు స్క్రిప్ట్ చెప్పింది ఒకటి.. డైలాగ్స్ రాస్తుంది ఒకటి ఇలాంటి డైలాగ్స్ నా సినిమాలో పెడితే అస్సలు ఒప్పుకోను ..ఊరుకోను..” అంటూ ఫుల్ ఓ రేంజ్ లో ఫైర్ అయిపోయారట . అయితే అప్పుడే సారీ చెప్పిన బాబీ – బాలయ్యకు నచ్చే విధంగా డైలాగ్స్ రాసి మెప్పిస్తానని ప్రామిస్ చేశారట. ఇదే న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెగ వైరల్ గా మారింది..!!