మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ నటించిన గాండీవ ధారి అర్జున సినిమా తాజాగా రిలీజ్ అయింది. ఈ సినిమాకు తొలి ఆటకే డిజాస్టర్ టాక్ వచ్చింది. అసలు వీకెండ్ లో శని, ఆదివారాలు కూడా ఈ సినిమాను చూసేందుకు ఎవరు ఇష్టపడలేదు. ఈ సినిమాకు రెండు కోట్ల రూపాయల షేర్ కూడా రాలేదని ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. అసలే అంతంతమాత్రంగా ఉన్న వేళ ఆగస్టు 29 నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన క్లాసికల్ హిట్ మూవీ మన్మధుడు సినిమాను పలుచోట్ల రీ రిలీజ్ చేశారు.
ముఖ్యంగా ఏ సెంటర్లు, పట్టణాలు, మున్సిపాలిటీలో ఈ సినిమాకు తొలి రోజు హౌస్‌ఫుల్ కలెక్షన్లు దక్కాయని ట్రేడ్ రిపోర్ట్ చెబుతోంది. విశేషమేంటంటే ఈ సినిమా దెబ్బకు వరుణ్ గాండీవధారి అర్జున ఆడుతున్న థియేటర్లను మూడు నాలుగు రోజులకే ఎత్తేశారు. ఆగస్టు 25న గాండీవ ధారి థియేటర్లలోకి వచ్చింది. తొలిరోజు నెగిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయింది. ఈ సినిమా వచ్చిన మూడు రోజులకే మన్మధుడు సినిమాను రిలీజ్ చేయడంతో వరుణ్ తేజ్ సినిమాను అన్ని థియేటర్ల నుంచి తప్పించేశారు.
ఇక మన్మధుడు సినిమా తొలి రోజు అన్ని ఏరియాలలోను హౌస్ పుల్స్ పడడంతో రెండో రోజు నుంచి కూడా గాండీవ ధారి సినిమా ప్రదర్శన పూర్తిగా నిలిపివేసి మన్మధుడును కంటిన్యూ చేస్తున్నారు. అలా రెండు మూడు రోజులుగా మన్మధుడు సినిమా ఏ సెంటర్లు, పట్టణాలు, మున్సిపాలిటీలో కంటిన్యూ అవుతుంది. అసలే మూలిగే నక్క అన్నచందంగా ఉన్న గాండీవ ధారి సినిమాపై ఇప్పుడు మన్మధుడు రూపంలో తాటిపండు పడడంతో గాండీవ ధారి షేర్ మరింత మైనస్‌ల్లోకి వెళ్లిపోయినట్లు అయింది.