తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర హీరోగా చలామణి అవటానికి కావలసిన అన్ని అర్హతలు అక్కినేని నవమన్మధుడు అఖిల్ లో ఉన్నాయి. టాలీవుడ్ మన్మధుడు నాగార్జున వారసుడిగా టాలీవుడ్లోకి అఖిల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. వాస్తవానికి నాగచైతన్య కూడా అఖిల్‌కు పెద్ద కుమారుడు.. అయినా నాగార్జునతో పాటు ఆయన భార్య అమల కాన్సన్ట్రేషన్ అంతా అఖిల్ మీదే ఉంటుంది అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఎలాగైనా అఖిల్‌ను మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ రేంజ్ హీరోగా నిలబెట్టాలని ఈ భార్యాభర్తలు ఇద్దరు ఎన్నో అష్ట కష్టాలు పడుతున్నారు. అయినా వీరి కోరిక నెరవేరటం లేదు. అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది. తొలి సినిమా అఖిల్ ఆ తర్వాత చేసిన హలో, మిస్టర్ మజ్ను మూడు సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. ఎలిజబుల్ బ్యాచిలర్ కొద్దో గొప్పో ఆడింది. తర్వాత ఏజెంట్ అయితే అఖిల్ కెరీర్ లో భయంకరమైన డిజాస్టర్ గా నిలవడంతో పాటు పీడకలగా మిగిలింది.
ఏజెంట్ దెబ్బతో టాలీవుడ్ లోనే మంచి నిర్మాతలలో ఒకరు అయిన అనిల్ సుంకర భారీగా నష్టపోయారు. ఏజెంట్ సినిమా వచ్చి కూడా నాలుగైదు నెలలు అవుతున్నా ఇప్పటివరకు అఖిల్ తర్వాత సినిమా గురించి ఎలాంటి వార్తలు రాలేదు. అసలు అక్కినేని అభిమానులు అయితే అఖిల్ సినిమా ఫ్యూచర్‌పై టెన్షన్ గా ఉన్నారు. ఇప్పటిలో అఖిల్ ఒక హిట్టైనా కొడతాడా అని ఫీల్ అవుతున్నారు. ఇదిలా ఉంటే శ్రీకాంత్ అడ్డాల, కోలీవుడ్ డైరెక్టర్ లింగస్వామి కాంబినేషన్లో అఖిల్ త్వరలోనే సినిమాలు చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
మరో టాక్ ప్రకారం ఈ ఇద్దరు డైరెక్టర్లు వరుసగా ప్లాపుల్లో ఉండడంతో వీరితో సినిమాలు వద్దని నాగార్జున అఖిల్‌కు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే యూవీ క్రియేషన్స్ అఖిల్ హీరోగా రు. 100 కోట్ల భారీ బడ్జెట్ తో ఒక పీరియాడికల్ సినిమా ప్లాన్ చేయాలని అనుకుంది. అయితే ఏజెంట్ డిజాస్టర్ తర్వాత నాగార్జున కూడా యూవీ క్రియేషన్స్ చేతుల్లో అఖిల్‌ను పెట్టేసి పాన్ ఇండియా హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని ప్లాన్ చేశాడట.
ఎందుకంటే ఇక్కడ ఖర్చు పెట్టేది మొత్తం యూవీ క్రియేషన్స్. సినిమా తేడా కొట్టిన నాగార్జునకు పోయేదేం ఉండదు. అయితే ఏజెంట్ రిజల్ట్ తర్వాత అఖిల్ మార్కెట్ జీరో అయిపోవడంతో ఇప్పుడు యూవీ క్రియేషన్స్ కూడా ఈ సినిమా నిర్మించేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఏది ఏమైనా ఇటు నాగార్జున కూడా అఖిల్‌ను నమ్మి మరో సినిమా చేసేందుకు సాహసించడం లేదు. కొడుకు మీద ఎంత ప్రేమ ఉన్నా కోట్లకు కోట్లు ఖర్చుపెడుతున్న ఫలితం ఉండకపోవడంతో నాగర్జున కూడా డైలమాలో పడిపోయిన పరిస్థితి.