తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న తెలుగు బిగ్ బాస్ ఏడో సీజన్ ప్రారంభమైంది. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ సీజన్లో కంటెస్టెంట్లు హౌస్ లో ఉండటం అంత ఈజీ కాదని పవర్ అస్త్రం ఎవరు ?దగ్గించుకుంటారో వాళ్ళే హౌస్ కి వెళ్తున్నారంటూ ఒక్కొక్క కంటెస్టెంట్ను పరిచయం చేస్తూ హౌస్ లోకి పంపించారు.
సీరియల్ నటి ప్రియాంక జైన్ ఆ తర్వాత వరుసగా హీరో శివాజీ – గాయని దామిని – ప్రిన్స్ యావర్ – నటి శుభశ్రీ – సీనియర్ నటి షకీలా – టీవీ నటి శోభాశెట్టి – టేస్టీ తేజ – నటి రితిక రోజ్ – యంగ్ హీరో డాక్టర్ గౌతమ్ కృష్ణ – సీనియర్ నటి కిరణ్ రాథోడ్ – పల్లవి ప్రశాంత్ – అమర్‌దీప్ చౌదరి తదితరులు ఎంట్రీ ఇచ్చారు.
తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయర్, హీరోయిన్ రతిక పదో కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తనకు ఎన్ని ప్రాజెక్టులు చేసినా సరైన గుర్తింపు రాలేదని.. బాగా చేశావు అంటున్నారే తప్ప మరో ఛాన్స్ ఇవ్వట్లేదని పోయింది. అందుకే బిగ్ బాస్ వేదికగా సరైన గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు తెలిపింది.
ఇక రతిక హార్ట్ ఎలా ఉందని అడిగిన నాగ్.. ఎందుకు ? బ్రేక్ అయిందని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా చేసిందంతా చేసి ఏమీ తెలియనట్లు అడుగుతున్నారు అని రతిక నాగ్‌తో అంటుంది. ఇంతకీ అసలు రతిక హార్ట్ ఎలా బ్రేక్ అయింది.. నాగ్ ఏం చేశాడు ? అన్నది తెలియాలంటే బిగ్ బాస్ చూడాలని చెప్పుకొచ్చింది. మొత్తానికి ఈ అమ్మాయి బిగ్ కాంపిటీషన్ ఇస్తుందని అర్థమవుతుంది.