ఈ మధ్యకాలంలో అక్కినేని నాగార్జునను సోషల్ మీడియాలో ఎలా కావాలనే టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా అక్కినేని నాగార్జున పేరు ఎక్కడ కనపడితే అక్కడ డిస్ లైక్ కొట్టడం బూతులు తిట్టడం కామన్ గా వినిపిస్తుంది . రీసెంట్గా స్కంధ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రామ్ పోతినేని బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాడు. ఈ క్రమంలోని కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ శివాజీ తో చాలా సరదాగా మాట్లాడాడు .
అంతేకాదు శివాజీ కూడా రామ్ తో చాలా క్లోజ్ గా మాట్లాడుతూ.. ఇంకెందుకు ఆలస్యం పెళ్లి చేసుకో అంటూ చెప్పుకొస్తాడు . అప్పుడే పక్కనే ఉన్న నాగార్జున మాట అందుకుని.. తాను మునిగిపోవడమే కాకుండా పక్కనుండి కూడా మరో వ్యక్తిని మునిగిపొమ్మని చెప్తున్నాడు అనే విధంగా కౌంటర్ వేస్తాడు . నిజానికి ఇది నాగార్జున నోట వచ్చే మాట కాదు .
ఇప్పటివరకు నాగార్జున స్టేజ్ పై ఇలాంటి మాటలు మాట్లాడిందే లేదు . అయితే ఎందుకు నాగార్జున ఇలా పెళ్లి పై నెగిటివ్గా స్పందించారు అనేది అభిమానులకు అర్థం కావడం లేదు . అంతేకాదు నాగచైతన్య లైఫ్ లో జరిగిన పెళ్లి తంతు చూసి నాగార్జునకు ఇలా విరక్తి వచ్చిందా..? అనే కోణంలో కూడా కామెంట్స్ చేస్తున్నారు జనాలు. దీంతో అసలు నాగార్జునకు ఏమైంది ఆయన ఎందుకు ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు స్టేజిపై అంటూ ఫ్యాన్స్ ఆరా తీయడం మొదలుపెట్టారు..!!