సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా ట్రోలింగ్కి గురైన ఫ్యామిలీ ఏదైనా ఉంది అంటే కచ్చితంగా అది అక్కినేని కుటుంబం అనే చెప్పాలి . ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ అన్న పేరు వినపడితే తెగ లైకులు వచ్చేటివి ..అన్ని పాజిటివ్ కామెంట్స్ వినిపించేవి. కానీ ఎప్పుడైతే నాగచైతన్య – సమంతకు విడాకులు ఇచ్చారో.. అఖిల్ అక్కినేని – శ్రేయ భూపాల్ కు పెళ్లికి ముందే బ్రేకప్ చెప్పారో.. అప్పటినుంచి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ఎదురుకుంటుంది అక్కినేని నాగార్జున ఫ్యామిలీ. ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో మరింత స్థాయి ట్రోలింగ్ ఎదుర్కొన్న అక్కినేని ఫ్యామిలీ ఇప్పుడు సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ ఆఫ్ పాజిటివ్ కామెంట్స్ తో హైలెట్ గా మారిపోయింది . దానికి కారణం రీసెంట్ గానే నాగర్జున పోస్ట్ చేసిన బిగ్ బాస్ షోలో తన మాజీ కోడలు సమంత పేరు ఎంతో ప్రేమగా ఆప్యాయంగా ప్రస్తావించడమే .
రీసెంట్గా స్టార్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ సెవెన్ షోలో అక్కినేని నాగార్జున డివర్స్ తర్వాత ఫస్ట్ టైం తన మాజీ కోడలు సమంత పేరుని పలికారు. ఖుషి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ బిగ్బాస్ షో కి రాగా “ఎక్కడ మీ హీరోయిన్ సమంత..?” అంటూ విజయ్ ను పలకరించడమే కాకుండా.. సమంత చాలా మంచి నటి అని ..ఆమెలో అద్భుతమైన టాలెంట్ ఉందని..ఓ రేంజ్ లో పొగిడేసారు. నిజానికి విడాకులు తీసుకున్న తర్వాత అక్కినేని ఫ్యామిలీ నుంచి అఖిల్ తప్పిస్తే సమంత పేరు ఎవరు పలకలేదు. ఫస్ట్ టైం నాగార్జున సమంత పేరుని ఆప్యాయంగా పలకడంతో ఇండస్ట్రీలో సమంత ఫ్యాన్స్ కూడా నాగార్జున చేసిన పనికి ఫిదా అయిపోతున్నారు .
ఇదే టైంలో అక్కినేని అమలా సైతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సెప్టెంబర్ 2న అన్నపూర్ణ ఫిలిం కాలేజీలో ణేఓ Fఈఏశ్టా 2ఖ్23′ కార్యక్రమం జరిగింది . ఇక ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న అమల స్టేజ్ పై అభిమానుల కోరిక మేరకు డాన్స్ చేసింది . “హలో బ్రదర్” లోని సూపర్ హిట్ సాంగ్ “ప్రియరాగాలే” పాటకు కాలు కదిపి అదరగొట్టేసింది. నిజానికి యాక్టింగ్ గుడ్ బై చెప్పి కొన్ని సంవత్సరాలు దాటుతున్న అమల ఇప్పటివరకు డ్యాన్స్ వేసింది లేదు . ఇంట్లో .. ఏ ఫంక్షన్ లో కూడా స్టెప్స్ వేయలేదు .
అమల ఫస్ట్ టైం ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ స్టేజిపై ఇరగదీసింది . దీంతో అమల పేరు కూడా సోషల్ మీడియాలో మారు మ్రోగితుంది . అయితే నిన్న మొన్నటి వరకు అక్కినేని ఫ్యామిలీ చాలా సైలెంట్ గా ఉండేదని..సడెన్ గా ఇంత మార్పులు ఎలా వచ్చాయి అని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. పడిపోయిన అక్కినేని ఫ్యామిలీ పరువుని లేపడానికి ఇంత ట్రై చేస్తున్నారు అంటూ జనాల సైతం ఆశ్చర్యకరంగా కామెంట్స్ చేస్తున్నారు . దీని వెనక పెద్ద మర్మమే ఉందని కొందరు అంటుంటే మరికొందరు అక్కినేని ఫ్యామిలీ మళ్ళీ ఇన్నాళ్లకు యాక్టీవ్ గా మారినందుకు సంబర పడుతున్నారు..!!