Newsనాగ‌చైత‌న్య‌కు కాబోయే రెండో భార్యను నేను అంటోన్న హీరోయిన్‌...ఏం ప్లాన్‌రా బాబు..!

నాగ‌చైత‌న్య‌కు కాబోయే రెండో భార్యను నేను అంటోన్న హీరోయిన్‌…ఏం ప్లాన్‌రా బాబు..!

అక్కినేని హీరో నాగచైతన్య కెరీర్ ప్రస్తుతం ఏమాత్రం బాగోలేదు. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ సమంతకు విడాకులు ఇచ్చేశాక చైతు కెరీర్ రోజురోజుకు డౌన్ అవుతూ వస్తోంది. సమంతతో విడాకుల తర్వాత చైతు చేసిన సినిమాలు ఏవి సక్సెస్ కాలేదు. అమీర్ ఖాన్ తో నటించిన లాల్ సింగ్ చద్దా – థాంక్యూ, ఈ ఏడాది వచ్చిన కస్టడీ సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. నాగచైతన్య మార్కెట్ పూర్తిగా డౌన్లో ఉంది.

సమంతకు విడాకులు ఇచ్చేశాక చైతు తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్లతో ప్రేమాయణం నడుపుతున్నట్టు పుకార్లు వస్తున్నాయి. ఎక్కడ చూసిన వీరు ఇద్దరు కలిసి చెక్కర్లే కొడుతున్నారు. లండన్ లో ఒక రెస్టారెంట్లో వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఇదిలా ఉంటే ఓ క్రేజీ హీరోయిన్ తాజాగా నాగచైతన్యను పెళ్లి చేసుకుంటానని చెప్పటం విశేషం.

పైగా తన ఇండస్ట్రీకి వచ్చింది కూడా చైతుని పెళ్లి చేసుకునేందుకే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె ఎవరో కాదు రీతు చౌదరి. ఆలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షోలో రీతు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ షోలో ఆలీ ఏ ఊరు మీది ? అని రీతూని అడిగితే నాది ఆంధ్ర – తెలంగాణ బోర్డర్.. తాను అక్కడ, ఇక్కడ ఉంటానని చెప్పింది.

ఒక గేమ్ లో భాగంగా అల్లు అర్జున్ ను ఫోటోను రీతు చౌదరి కరెక్ట్ ప్లేస్‌లో పెట్టక ఆలీ నువ్వు అల్లు అర్జున్ ఫ్యాన్‌వా అని అడిగాడు. వెంటనే రీతు చౌదరి – నాగచైతన్య నేను పెళ్లి చేసుకుందామని.. తాను ఇండస్ట్రీకి వచ్చానని తెలిపింది. దీంతో అది చూసిన నెటిజన్లు, అక్కినేని అభిమానులు నీకు అంత సీన్ లేదు.. కాస్త తగ్గ‌మ్మా.. నీకు చైతును పెళ్లి చేసుకునే సీన్ ఉందా ? అంటూ ఆమెపై ఫైర్ అవుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news