టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు బాగా తెలిసిందే. ప్రజెంట్ ఓ పక్క సినిమాలతో మరోపక్క రాజకీయాలతో బిజీబిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు టోటల్ ఫోకస్ మొత్తం రాజకీయాలపైనే పెట్టారు . పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన తొలిప్రేమ సినిమా ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు . ఆయన కెరియర్ లో ఎన్నో సినిమాలు నటించినా .. ఆ సినిమానే ఫాన్స్ కు బాగా బాగా నచ్చేస్తుంది.
చాలామంది ఆయన ఫ్యాన్స్ ఇప్పటికీ ఈ సినిమాను టీవీలో యూట్యూబ్లో చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు . మరి ముఖ్యంగా ఈ సినిమాల్లో పవన్ కళ్యాణ్ నటన కేక అన్న కామెంట్స్ కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. అయితే ఈ సినిమాను బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బీ అమితాబచ్చన్ తన భార్యతో కలిసి చూస్తున్న టైం లో పవన్ కళ్యాణ్ పై పిచ్చ కోపం వచ్చిందట.
తన మనసులోని ప్రేమను హీరోయిన్ కి చెప్పకుండా.. ఆమె బై చెప్తే బై అంటూ తన ప్రేమను తన మనసులోనే దాచుకుని బాధపడే సీన్ చూసి అమితాబచ్చన్ కోప్పడ్డారట .అసలు ఎవడ్రా ఈ సీను రాసింది .. ప్రేమ విషయాని బయటపెట్టకుండా.. కుమిలి ఏడ్చేవాడు మగాడే నా..అంటూ ఫైర్ అవుతూ సరిగ్గ పవన్ ఫేస్ పై పక్కనే ఉన్న కారు కీస్ విసిరి కొట్టారట. అయితే ఆ తర్వాత మళ్లీ హీరోయిన్ వచ్చి పవన్ కళ్యాణ్ నుదట పై కిస్ చేసి ,,ఐ లవ్ యు అని చెప్పడంతో బిగ్ బి అమితాబచ్చన్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారట . జయా బచ్చన్ కూడా ఈ సినిమాను చూసి బాగా లైక్ చేసిందట . దీంతో ఇదే విషయం మరోసారి ట్రెండ్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్..!!