ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మెగా డాటర్ నీహారిక పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా నిహారిక జొన్నలగడ్డ చైతన్యకు విడాకులు ఇచ్చినప్పటి నుంచి ఆమెపై స్పెషల్ ఫోకస్ చేశారు జనాలు . ఇలాంటి క్రమంలోనే ఆమె ఏం మాట్లాడిన దానికి ద్వంద అర్ధాలు తీస్తూ ట్రోల్ చేస్తున్నారు . రీసెంట్గా నిహారిక తన క్లోజ్ ఫ్రెండ్ అయినా యూట్యూబర్ నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే విషెస్ అందించింది .
అయితే అందరిలా కాకుండా కూసింత డిఫరెంట్ గా విష్ చేసింది . “యాంకరింగ్ నుంచి సహనటుడి గా మారావు..అక్కడ నుంచి నిర్మాతగా ..ఆ తర్వాత నా చిట్టి తమ్ముడిగా మారిపోయావు .. మనం కలిసి చాలా దూరం ప్రయాణించాం..స్వచ్ఛమైన మనసు ఉన్న వాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉంటారు . వాళ్ళల్లో ఒకడివే నువ్వు.. లవ్ యు నీక్కు.. గ్రేట్ బర్త్డ డే నానా” అంటూ ఇంస్టాగ్రామ్ లో అత్తగారితో దిగున్న .. ఫొటోస్ ను పోస్ట్ చేసి రాసుకోచ్చారు.
అయితే నిఖిల్ కారణంగానే నీహారిక చైతన్య విడిపోయారు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. వాళ్ళిద్దరి మధ్య ఎఫైర్ ఉంది అంటూ కూడా పలువురు తప్పుడు కామెంట్స్ చేశారు . అయితే అతడు నా తమ్ముడితో సమానం అంటూ క్లారిటీ ఇచ్చేసింది నిహారిక . అయితే ఇన్నాళ్లు లేని నిహారిక ఇప్పుడు తనను తమ్ముడు అని పిలవడం ఏంటి ..? అంటూ జనాలు మండిపడుతున్నారు. కొందరు చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం.. అంతా అయిపోయింది విడాకులు కూడా తీసేసుకున్నావుగా ఇంకెందుకు ఈ క్లారిటీ అంటూ చీప్ గా కామెంట్స్ చేస్తున్నారు..!!