టాలీవుడ్ ఇండస్ట్రీలో.. మెగా డాటర్ గా పేరు సంపాదించుకున్న నిహారికకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా నిహారిక కు సోషల్ మీడియాలో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉన్న నిహారిక ఇండస్ట్రీలోకి హీరోయిన్గా కూడా ఎంట్రీ ఇచ్చింది . అయితే హీరోయిన్గా ఆమె చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవ్వడంతో వాటికి స్టాప్ చెప్పేసి ఇంట్లో చెప్పిన సంబంధాన్ని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోవాలనుకునింది.
కానీ తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్లు ఆమె జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకున్న రెండేళ్లకి విడాకులు తీసుకుంది . ఈ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫామ్ చేసింది నిహారిక . అప్పటినుంచి సోషల్ మీడియాలో సింగల్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను ఉత్సాహపరిచే నిహారిక రీసెంట్గా తన అన్నలకు రాఖీ కడుతున్న వీడియోని సైతం షేర్ చేసింది. కాగా తాజాగా నిహారిక పెట్టిన పోస్టు మెగా అభిమానులకు కొత్త డౌట్లు పుట్టిస్తుంది, విడాకుల తర్వాత బాడీ ఫిజిక్ పై ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్న నిహారిక జిమ్ లో గంటలు గంటలు టైం స్పెండ్ చేస్తుంది. దానికి తగ్గ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటుంది .
ఈ క్రమంలోనే రీసెంట్గా నిహారిక జిమ్ లో వర్క అవూట్స్ చేస్తూ లాస్ట్ వర్కౌట్ ఇన్ హైదరాబాద్ అంటూ రాసుకొచ్చింది. అంటే నిహారిక హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతుందా..? అంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు. మరి కొందరు విడాకుల తర్వాత మెగా ఫ్యామిలీకి నిహారిక దూరంగా ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది . నాగబాబు అయితే మాట్లాడడమే మానేశారట. ఈ క్రమంలోనే ఇవన్నీ భరించలేని నిహారిక విడాకులు తర్వాత ఒంటరిగా ఉండడమే బెస్ట్ అంటూ ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళిపోవాలని డిసైడ్ అయినట్లు ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు. దీంతో నిహారిక మెగా ఫ్యామిలీకి దూరంగా వెళ్లిపోతుంది అన్న న్యూస్ వైరల్ గా మారింది . ఇది నిజమో..?కాదో..దీనిపై నిహారిక స్పందిస్తేనే బాగుంటుంది అంటున్నారు మెగా ఫ్యాన్స్..!