Newsమరో క్రేజీ ఆఫర్ పట్టేసిన మీనాక్షి చౌదరి.. ఈసారి ఏకంగా అలాంటి...

మరో క్రేజీ ఆఫర్ పట్టేసిన మీనాక్షి చౌదరి.. ఈసారి ఏకంగా అలాంటి సినిమానే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ..ఎవరి.. టైం ఎలా మారిపోతుందో..? ఎలా మలుపు తిరుగుతుందో ..? చెప్పలేకపోతున్నాం. ఆ లిస్టులోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి . నిన్న మొన్నటి వరకు మీనాక్షి చౌదరి అంటే కేవలం మోడల్ గానే చూసేవారు. కానీ రాత్రికి రాత్రి ఆమె ఖాతాలో భారీ ఆఫర్ వచ్చి చేరడంతో .. అందరూ ఆమెకే ఓట్లు వేస్తున్నారు .

ఆమెని సినిమాలో పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు సరసన వన్ ఆఫ్ ది హీరోయిన్ గా మీనాక్షి చౌదరి సెలెక్ట్ అయింది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో మీనాక్షి చౌదరి పేరు మారుమ్రోగిపోతుంది . రీసెంట్ గా మీనాక్షి చౌదరి ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తుంది . వెంకీ అట్లూరి దర్శకత్వంలో మలయాళీ హీరో దుల్కర్ సల్మాన్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాకి లక్కీ భాస్కర్ అనే పేరు కూడా పెట్టారు . ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని అనుకుంటున్నారట . ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్లు తెలుస్తుంది . సితార ఎంటర్ టైన్మెంట్స్..శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి . దీంతో సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . ఇలా బ్యాక్ టు బ్యాక్ వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్ అందుకుంటున్న మీనాక్షి చౌదరి.. త్వరలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారిపోబోతోంది అంటూ చెప్పుకొస్తున్నారు జానాలు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news