News"చంద్రబాబు అరెస్ట్.. పవన్ సపోర్ట్..ఎన్టీఆర్ మౌనం".. మంచు లక్ష్మి రెచ్చకొట్టే ట్వీట్...

“చంద్రబాబు అరెస్ట్.. పవన్ సపోర్ట్..ఎన్టీఆర్ మౌనం”.. మంచు లక్ష్మి రెచ్చకొట్టే ట్వీట్ వైరల్.. !!

ప్రజెంట్ ఏపీ రాజకీయాలు ఎంత హాట్ హాట్ గా ముందుకు వెళ్తున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . జనరల్ గానే అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఇలాంటి హడావిడి ఉంటుంది . కానీ ఈసారి కూసింత డిఫరెంట్ మాజీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడం .. ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనులు సృష్టిస్తుంది . స్కిల్ డెవలప్మెంట్ భారీ కుంభకోణం కేసులో అధికార పార్టీ.. ప్రతిపక్ష పార్టీ నేత చంద్రబాబు నాయుడు ను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో ఏపీ రాజకీయాలలో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

ఇలాంటి క్రమంలోనే ఈసారి పాలిటిక్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఎంట్రీ ఇవ్వడం సీఎంగా పోటీ చేస్తూ ఉండడంతో సినిమాకి సంబంధించిన వాళ్ళు కూడా ఎలక్షన్స్ పై కాన్సెంట్రేషన్ చేస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే మంచు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన విషయం తెలిసిందే . అంతే కాదు పవన్ కళ్యాణ్.. టిడిపి తో పాటు పోటీ చేసి గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు .

అయితే నందమూరి నటవారుసుడైన ఎన్టీఆర్ – చంద్రబాబు నాయుడు అరెస్టుపై స్పందించకపోవడంతో సోషల్ మీడియాలో రచ్చ రంబోలా చేస్తున్నారు . ఇలా ఒకదానికి మించి మరొక న్యూస్ వైరల్ అవుతూ ఉంటే మంచు లక్ష్మి తాజాగా ఏపీ రాజకీయాలపై చేసిన ట్విట్ రెచ్చగొట్టేలా ఉంది అంటున్నారు ఫాన్స్. “.. వావ్ ఏపీ రాజకీయాలు భళే ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి “అంటూ ట్విట్ చేసింది .

ఆఫ్ కోర్స్ మంచు లక్ష్మి చేసిన ట్వీట్ లో పెద్దగా కాంట్రవర్షియల్ ఏమీ లేదు.. కానీ కావాలనే పలువురు నేతలు ఆమె అంటే ఇష్టం లేని వాళ్ళు వ్యంగ్యంగా కామెంట్ చేస్తుంది అంటూ కావాలనే ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు ఆమె కాదు అందరు ఇదే కామెంట్స్ చేస్తున్నారు. ఏపీ రాజకీయాలు నిజంగానే హాట్ గా ఉన్నాయి అంటూ మంచు లక్ష్మి కి సపోర్ట్ చేస్తున్నారు . దీంతో మంచు లక్ష్మి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news