సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ట్రోలింగ్ అనేది చాలా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ పై ప్రముఖ హీరో కూతుర్లపై ఇలాంటి ట్రోలింగ్ ఎక్కువగా చూస్తున్నాం . తాజాగా మంచు లక్ష్మిని సైతం కొందరు కుర్రాళ్ళు ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు . అయితే ఇన్నాళ్లు ఓపికగా చూసిన మంచి లక్ష్మి ఈసారి మాత్రం ఫుల్ ఫైర్ అయిపోయింది . మీకు ఏంట్రా నొప్పి..? అంటూ హద్దులు మీరి మాట్లాడేసింది. దీంతో ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది .
మంచు లక్ష్మి తన కళ్ళకు కనిపించిన విషయాన్నైనా సరే వీడియో లేదా పిక్చర్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. అది ఆమెకు అలవాటు . అదేవిధంగా ఈసారి కూడా ఎయిర్ పోర్ట్ లో కనిపించిన కార్పెట్ ని తన ఐఫోన్ తో షూట్ చేసి వీడియో షేర్ చేసింది. “ఎయిర్పోర్ట్లో కార్పెట్ శుభ్రంగా లేవు .. బిజినెస్ క్లాస్ కి వెళ్లే కార్పొరేట్స్ ఇంత దారుణమా..? నా ఐఫోన్ కొంచెం బెటర్ గా చూపించాయి” అంటూ వీడియో పోస్ట్ చేసింది .
దీనితో వెంటనే ఆమెపై నెటిజన్లు విరుచుకుపట్టారు. నువ్వు బిజినెస్ క్లాస్ లో తిరుగుతున్నావని గొప్పలు చెప్తున్నావా ..? అంత టెకా..? అంటూ హద్దులు మీరి పోయారు . ఈ క్రమంలోనే మంచు లక్ష్మి వీడియో ద్వారా అందరికీ ఇచ్చి పడేసింది . నా ఐ ఫోన్.. నా డబ్బులు.. మీకేంట్రా నొప్పి..? మీరు ఏమైనా నాకు డబ్బులు ఇస్తున్నారా..? అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయిపోయింది . అంతేకాదు ఇంకొకసారి ఎవరు తనని ట్రోల్ చేయని విధంగా ఆమె ఉన్నది ఉన్నట్లు నిజాయితీగా మాట్లాడి కూసింత గట్టిగానే ఓ రేంజ్ లో ఫైర్ అయింది . దీంతో సోషల్ మీడియాలో ఆమె మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి..!!