బిగ్ బాస్ కంటెస్టెంట్ మహేష్ విట్టా తన ప్రియురాలు శ్రావణి రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. ప్రొద్దుటూరులో హెల్త్ క్లబ్ ఫంక్షన్ హాల్ లో వారిద్దరి కళ్యాణ వేడుక వైభవంగా జరిగింది. మహేష్ విట్టా – శ్రావణి పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో ఆయన షేర్ చేశారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉండగానే మహేష్ తన ప్రేమ కథను రివిల్ చేసిన విషయం తెలిసిందే.
అయితే అప్పట్లో ఆమె పేరు మాత్రం బయటికి చెప్పలేదు. శ్రావణి రెడ్డిని మహేష్ ఐదు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నట్టు చెప్పాడు. ఇంతకు ఆమె ఎవరో ? కాదు.. మహేష్ చెల్లికి స్నేహితురాలు కావడం విశేషం. మొదట్లో మహేష్ ఆమె వెంటపడినా అతడి ప్రేమను శ్రావణి రిజెక్ట్ చేసింది. నల్లగా ఉన్న అతడిని ప్రేమించడం ఏంటని ? అన్నట్టుగా ఉండేదట.
అయితే పట్టు వదలన్ని విక్రమార్కుడిలా ఆమె ప్రేమను సాధించానని మహేష్ చెప్పాడు. రెండేళ్లు తాము స్నేహితులుగా ఉన్నామని… ఆ తర్వాత తన ప్రేమకు శ్రావణి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని పేర్కొన్నాడు. శ్రావణి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా మహేష్ పలు సినిమాలలో నటిస్తున్నాడు. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చాక మహేష్‌కు మరింత క్రేజ్ పెరిగింది.
సోషల్ మీడియాలోనూ.. అటు సినిమా రంగంలోనూ పాపులారిటీతో దూసుకుపోతున్నాడు. మహేష్ తనను వద్దన్న అమ్మాయిని తన భార్యగా చేసుకున్నాడు.