తాజాగా మెగా కోడలు లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పటికే మెగా హీరో వరుణ్ తేజ్ తో ఆమెకు ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ ఏడాది చివర్లోనే లావణ్య త్రిపాఠి.. వరుణ్ తేజ్ పెళ్లి కూడా జరగనుంది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ? ఎక్కడ చేయాలన్న దానిపై మెగా కుటుంబం ప్రణాళికలు రచిస్తోంది.
ఇదిలా ఉంటే గతి కొంతకాలంగా లావణ్య త్రిపాఠి.. వరుణ్ తేజ్ పెళ్లి జరుగుతుందా లేదా ? మరోవైపు నిహారిక విడాకులు ఇలా రకరకాలుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. నిహారిక విడాకుల వల్ల లావణ్య డిస్టర్బ్ అయ్యిందని.. ఈ పెళ్లిపై ఆసక్తిగా లేదంటూ వార్తలొస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో లావణ్య త్రిపాఠికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. తమపై సోషల్ మీడియా వేదికగా వస్తున్న పుకార్లపై విరుచుకుపడింది.
ప్రస్తుతం ఇంటర్నెట్ అనేది ఒక గాసిస్ కాలంగా మారిపోయింది. ప్రతి ఒక్క యేజ్ గ్రూపునకు చెందిన వారి గురించే కూడా ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. ఒక పర్సన్ ను చూసి మూడు నిమిషాల్లోనే జడ్జిమెంట్ ఇవ్వడం ఇకనైనా ఆపేయండి.. మనం ఒకరి గురించి నెగటివ్ గా మాట్లాడుతున్నామంటే మన లైఫ్ కూడా అలాగే ఉంటుందని తెలుసుకోండని చెప్పింది.
ఇలాంటి పుకార్లు సృష్టించే సమయాన్ని మీరు మీకోసం ఉపయోగించుకోండి అంటూ లావణ్య తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకు వచ్చింది. ఇప్పటివరకు ఈ విషయంలో చాలా ఓపికగా.. సహనంతో ఉన్న లావణ్య ఇప్పుడు ఏకంగా వరుణ్ తనతో పాటు మెగా ఫ్యామిలీపై వస్తున్న పుకార్లకు ఘాటుగా రిప్లై ఇచ్చినట్లయ్యింది అన్న కామెంట్లు పడుతున్నాయి.