Moviesవిజ‌య్ ఖుషి సినిమాపై నెగ‌టివ్ ప్ర‌చారం వెన‌క ఆ ముగ్గురు స్టార్...

విజ‌య్ ఖుషి సినిమాపై నెగ‌టివ్ ప్ర‌చారం వెన‌క ఆ ముగ్గురు స్టార్ హీరోలు..!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ – సమంత జంటగా నటించిన ఖుషి సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే రు. 80 కోట్ల వసూళ్లు సాధించిన ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ లోనే ఆల్ టైం బ్లాక్ బస్టర్ సినిమాగా రికార్డులకు ఎక్కనుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న వేళ హీరో విజయ్ దేవరకొండ తన సినిమాపై కొందరు డబ్బులు ఇచ్చి మరి నెగటివ్ ప్రచారం చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ టాలీవుడ్ లోనే కొందరు స్టార్ హీరోలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారంటూ ఒకటే ప్రచారం జరుగుతుంది. విజయ్ దేవరకొండ ఏ హీరోను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు అన్నదానిపై ఇండస్ట్రీలో రకరకాల పుకార్లు కూడా నడుస్తున్నాయి.

గతంలో విజయ్ దేవరకొండకు హీరో నానికి మధ్య కొంత గ్యాప్ ఉందన్న ప్రచారం ఉంది. నాని హీరోగా నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో విజయ్ దేవరకొండ చిన్న పాత్రలో కనిపించాడు. అప్పటికే నానికి తిరుగులేని క్రేజ్ ఉంది. ఆ సినిమా తర్వాత విజయ్ నాని సినిమాలను మించి మార్కెట్లో దూసుకుపోతున్నాడు. ఇక ఇటీవల కుర్ర హీరో విశ్వక్సేన్ కు విజయ్ దేవరకొండకు మధ్య కాస్త గ్యాప్ వచ్చిందన్న ప్రచారం ఉంది.

ఇక విజయ్ దేవరకొండ ఫామ్ లోకి వచ్చాక మాస్ మహారాజా రవితేజ సినిమాలపై కూడా గట్టిగా ఎఫెక్ట్ పడుతోంది. ఓవైపు రవితేజ సినిమాలు వరుసగా డిజాస్టర్లు అవుతుంటే విజయ్ దేవరకొండ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు అన్న టాక్‌ కూడా ఇండస్ట్రీలో ఉంది అందుకే సోషల్ మీడియాలో ఈ ముగ్గురు హీరోలు పేర్లతో విజయ్ దేవరకొండ సినిమాను టార్గెట్ చేశారంటూ పుకార్లు నడుస్తున్నాయి మరి ఇందులో వాస్తవ అవాస్తవాలు ఏంటన్నది వారికే తెలియాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news