సినిమా ఇండస్ట్రీలో ఓ హీరో పైకి ఎదుగుతున్నాడు అంటే కిందకి లాగడానికి నాలుగు చేతులు ఎప్పుడు రెడీగా ఉంటాయి . అంతేకాదు ఆ హీరో పైకి ఎదిగేస్తున్నాడు అంటే తొక్కేయడానికి ఎప్పుడూ నలుగురు మనుషులు చుట్టుపక్కల ఉండనే ఉంటారు. ప్రెసెంట్ అలాంటి సిచువేషన్ ని ఫేస్ చేస్తున్నాడు టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ . రీసెంట్గా ఆయన నటించిన సినిమా ఖుషి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .
సినిమా హిట్ అయిన సందర్భంగా విజయ్ దేవరకొండ పెద్ద మనసుతో తన సినిమాలోని రెమ్యూనరేషన్ నుండి ఒక కోటిని తన ఫ్యాన్స్ కుటుంబాలకు పంచాలని డిసైడ్ అయ్యారు . దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు . అయితే ఇక్కడే ఓ పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది . గతంలో విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమా వల్ల నష్టపోయిన ఆయన విజయ్ పై మండిపడ్డారు.
ఈ విషయాన్ని మరోసారి ఎత్తి చూపి విజయ్ ని కించపరుస్తూ ఘాటుగా పోస్ట్ చేశారు అభిషేక్ పిక్చర్స్ . “మీ సినిమా హిట్ అయినందుకు అభిమానులకు కోటి రూపాయలు ఇస్తున్నారు గుడ్.. మరి మీ సినిమాను నమ్ముకుని డిస్ట్రిబ్యూటర్స్ నష్టాలను చూశాం. ఇప్పటివరకు దానిపై మీరు స్పందించలేదు అని పోస్ట్ చేశాడు”. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆయనపై రెచ్చిపోతున్నారు. సినిమా ఫ్లాప్ అయితే డబ్బులు అడుగుతున్నావు ..? మరి హిట్టయితే నీకు వచ్చిన లాభాలలో విజయ్ దేవరకొండకు డబ్బులు ఇస్తావా ..? సినిమా హిట్ అయిన ఫ్లాప్ పైన లెక్కలు అనేటివి ప్రొడ్యూసర్స్ మీరు మీరు చూసుకోవాలి. హీరో పై ఇలా నిందలు వేస్తారా..? అసలు నిన్ను ఎవడు కొనమన్నాడు సినిమా..? విజయ్ నీ దగ్గరకు వచ్చి నా సినిమా కొనండి రా బాబు అన్నాడా..?అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు . దీంతో ఇదే ఇష్యూ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!