శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ అంతా ఆమె వెంటే పడుతోంది. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయం అయింది. ఆ సినిమాకు ఆమె పారితోషకం గట్టిగా 30 లక్షలు కూడా లేదు. ఇంకా చెప్పాలి అంటే రు. 25 లక్షల రేంజ్ లోనే ఇచ్చారు. ధమాకా సినిమాకు కాస్త పెంచింది. ఆ సినిమా కూడా సూపర్ హిట్.
ఇక అంతే ఇప్పుడు ఏకంగా శ్రీలీల చేతిలో పదికి పైగా సినిమాలు ఉన్నాయి. మహేష్ బాబు – పవన్ కళ్యాణ్ – రామ్ – వైష్ణవ తేజ్ – రవితేజ – సాయి ధరమ్ తేజ్ ఇలా చెప్పుకుంటూ పోతే కుర్ర హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అందరూ శ్రీలీల వెంటే పడుతున్నారు. ఇక నటసింహం బాలయ్య భగవంత్ కేసరి సినిమాలోను శ్రీలీల కూతురు పాత్రలో కనిపిస్తోంది. ఇదంతా కాసేపు పక్కన పెడదాం. ఆమె బోయపాటి డైరెక్షన్లో యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్‌కు జంటగా నటించిన సినిమా స్కంద.
గత కొన్నిళ్ళుగా రామ్ సినిమాలు ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కావడం లేదు. ఒకటే మూస నటన.. రొటీన్ కథలతో సినిమాలు చేస్తున్నాడు.. అందుకే రామ్ సినిమాలు ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. పైగా ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్కంద చేస్తున్నాడు. బోయపాటిది కూడా రొటీన్ స్టైల్. అయితే బాలయ్యతో బోయపాటి తీసే సినిమాల సంగతి వేరు. ఇక స్కంద ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ చూసిన జనాలు అంతా పెదవి విరుస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఓటిటి, టీవీ రేట్స్ కు ఏకంగా 54 కోట్లు ఇచ్చేలా హాట్‌స్టార్‌తో ఒప్పందం కుదిరింది.
ఇదంతా కేవలం శ్రీలీల మహిమ అని టాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. రామ్‌ని చూసి అన్ని కోట్లు కుమ్మరించడం జరిగే పని కాదు. శ్రీలీల తో పాటు మరొక విషయం కూడా ఒప్పుకుని తీరాలి. బోయపాటి సినిమాలు బుల్లితెరపై టీవీలలో పిచ్చపిచ్చగా చూస్తారు. మాస్ జనాలు ఆయన సినిమా కోసం వేలం వెర్రిగా ఎగబడతారు. ఈ రెండు కారణాల వల్లే ఈ సినిమాకు ఏకంగా రు. 54 కోట్లు రిలీజ్ కాకుండానే నిర్మాత జేబులో పడ్డాయి. ఏది ఏమైనా ఒక మిడిల్ రేంజ్ హీరో పక్కన శ్రీలీల ఉన్నా సరే ఆ సినిమా బిజినెస్ హాట్ కేకులా జరుగుతోంది.