ఖుషి ఫలితంతో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ సమంత ఇద్దరు ఖుషి ఖుషి గా ఉన్నారు. కాస్త గ్యాప్ తర్వాత ఇద్దరు హిట్ కొట్టారు.గుణశేఖర్ శాకుంతలం సినిమాలో సమంత గెటప్ కు బాగా నెగిటివ్ మార్కులు వచ్చాయి. దీనికి తోడు అనారోగ్య సమస్యల కారణంగా ఇటీవల ఆమె ఫేసులో మునుపటి చరిష్మా లేదు. బాగా మార్పులు వచ్చాయి. ఒకటి రెండు పబ్లిక్ అపీరియన్స్ లు కూడా ఆమెకు మరింత నెగిటివ్ మార్కులు పడేలా చేశాయి.
ఇలాంటి టైంలో సమంత సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకుంటున్నా అని చెప్పేసరికి కూడా ఆమె ఇక రిటైర్ అయినట్టే అని ఆమె అభిమానులు ఫీల్ అయ్యారు. ఆమె మయోసైటిస్ వ్యాధి చికిత్స కోసం అమెరికా వెళుతున్నట్టు చెప్పేశారు. దీంతో ఆమె మళ్లీ సినిమాలు చేస్తుందన్న ఆశలు ఎవ్వరికి లేవు. ఇలాంటి టైం లో ఖుషి వచ్చింది. ఏది ఏమైనా సినిమా సూపర్ గా ఉంది. గ్లామర్ పరంగా సమంత మంచి మార్కులు సంపాదించుకుంది.
యంగ్ హీరోల పక్కన కొత్త కొత్త హీరోయిన్లను తీసుకువస్తున్న టైంలో ఆమె విజయ పక్కన నటించి ఓకే అనిపించుకుంది తప్ప నెగిటివ్ కాలేదు. పైగా రొమాంటిక్ సీన్లలో సమంత బాగుంది అనిపించుకుంది. తెలుగులో హీరోయిన్ల కొరత చాలా ఉంది. నటన విషయంలో సమంతకు తిరుగే లేదు. కాస్త యంగ్.. గ్లామర్ లుక్స్ లో కనిపిస్తే మరికొన్నిళ్ళపాటు ఆమెకు చాలా సినిమాలు చేతిలో ఉంటాయి.
యంగ్ హీరోలను పక్కన పెడితే సీనియర్ హీరోలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడూ హీరోయిన్ల సమస్య.. అందువల్ల సమంత తన నిర్ణయం మార్చుకుని తూచ్ తాను మళ్లీ సినిమాలు చేస్తా అంటే మళ్లీ టాలీవుడ్ లో ఒక వెలుగు వెలగవచ్చని అంటున్నారు.