Moviesఅనకూడని మాట మాట్లాడిన సావిత్రి.. లాగి పెట్టి కొట్టిన ఎన్టీఆర్..ఏమైందంటే..?

అనకూడని మాట మాట్లాడిన సావిత్రి.. లాగి పెట్టి కొట్టిన ఎన్టీఆర్..ఏమైందంటే..?

సినిమా ఇండస్ట్రీలో మహానటి అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది సావిత్రి . తన అందంతో తన నటనతో తన వాక్చాతుర్యంతో సినిమా ఇండస్ట్రీలో మకుటం లేని మహారాణిలా ఏలేసింది .అంతేకాదు ఆమె నటించిన సినిమాలు ఇప్పటికీ మనం టీవీలో చూస్తూ ఆమెని ఆరాధిస్తున్నాం అభినందిస్తున్నామంటే ఆమె నటనే అందుకు కారణమని చెప్పక తప్పదు . కాగా ఇప్పటికీ మన ఇంట్లోనే అమ్మమ్మలు తాతలు, నానమ్మలు, శ్రీదేవి సావిత్రి ఫ్యాన్స్ అని చెప్పుకోక తప్పదు .. అయితే అలాంటి సావిత్రి జెమినీ గణేషన్ ను పెళ్లి చేసుకొని చాలా పెద్ద తప్పు చేసింది అని అప్పట్లో ఆమె ఫ్యాన్స్ కూడా ఆమెపై ఫైర్ అయ్యారు .

అయితే ఆమె అంటే ఎంతో ఇష్టం అభిమానించి.. ఆమె బాగుంటే చాలు అనుకునే వాళ్ళల్లో మన ఎన్టీ రామారావు గారు కూడా ఒకరు . కాగా ఎన్టీరామారావుతో సావిత్రి ఎన్నో సినిమాల్లో నటించింది . ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే సావిత్రి ఇలా చెప్పకుండా జెమినీ గణేషన్ ను పెళ్లి చేసుకోవడం ఎన్టీఆర్ కి మింగుడు పడలేదు . అంతేకాదు ఆమె లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అని ముందే గెస్ చేశారు.

అయితే జెమినీ గణేషన్ చేతిలో మోసపోయాను అని రియలైజ్ అయిన తర్వాత సావిత్రి ఏం చేయాలో దిక్కు తోచక .. నా అనే వాళ్ళు దగ్గర తీయని తరుణంలో ఆమె సూసైడ్ చేసుకోవాలనుకునిందట . అంతేకాదు ఈ విషయం తెలుసుకున్న ఎన్టీ రామారావు స్ట్రైట్ గా ఆమె వద్దకు వెళ్లి లాగి పెట్టి కొట్టే వరకు వెళ్లారట . కానీ సావిత్రి పై ఉన్న అభిమానంతో అక్కడితోనే ఆగిపోయారట . అంతేకాదు సావిత్రికి లైఫ్ అంటే ఏంటి ..? లైఫ్ లో తీసుకున్న తప్పుడు నిర్ణయాలు తాలుక విషయాలను క్లియర్ గా వివరించారట . ఆ తర్వాతే సావిత్రి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news