టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కాగ గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ . దానికి కారణం ఆయన మామ మాజీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడమే . కాగా స్కిల్ డెవలప్మెంట్ భారీ కుంభకోణం కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టు అయ్యారు. అయితే ఆయన అరెస్టుపై చాలామంది స్పందిస్తూ అధికార పార్టీని తప్పు పడుతూ ఉంటే ..ఎన్టీఆర్ ఏమాత్రం స్పందించకపోవడం ..అసలు దాని గురించి ఏం మాట్లాడకపోవడం పెద్ద హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది .
అయితే రీసెంట్ గా ఎన్టీఆర్ దుబాయ్ కి వెళ్లారు . సైమా అవార్డ్స్ కోసం దుబాయ్ వెళ్లినట్లు తెలుస్తుంది . అయితే కావాలనే పలువురు హేటర్స్ ఈ విషయాన్ని హాట్ టాపిక్ గా మార్చి ట్రెండ్ చేస్తున్నారు . మామగారిని అరెస్ట్ చేస్తే ఏం పట్టని ఎన్టీఆర్ ..అవార్డు తీసుకోవడానికి మాత్రం దుబాయ్ వెళ్లారు అంటూ ఫైర్ అయిపోయారు . అయితే దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ రీకౌంటర్ మెసేజెస్ చేస్తున్నారు.
చంద్రబాబు నాయుడు అరెస్టు అయితే ఎన్టీఆర్ ఏం పనులు చేసుకోకూడదా..? ఎక్కడికి వెళ్లకూడదా..? అంటూ తిరిగి కౌంటర్స్ వేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అసలు ఎందుకు తారక్ ఈ విషయం పై స్పందించడం లేదు అనేది ఎవ్వరికి అర్ధం కావడం లేదు..!!