టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య ప్రజెంట్ ఎలాంటి టఫ్ సిచువేషన్ ఫేస్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఓవైపు సినిమాలు హిట్ అవ్వక.. మరోవైపు పర్సనల్ లైఫ్ లో సెటిల్ అవ్వలేక.. నానాదంటాలు పడుతున్నారు . కోట్ల ఆస్తి ఉన్నా సరే కంటి నిండా ఆనందం లేదు. అసలు సంతోషంగా ఉన్న సుఖమే లేదు. అలాంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు అక్కినేని నాగచైతన్య .. అయితే ఇలాంటి క్రమంలోనే ఆయనకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అసలే ఖుషి సినిమా హిట్ అవ్వడంతో పలువురు నాగచైతన్యను విపరీతంగా ట్రోల్ చేస్తుంటే ఇదే టైంలో నాగచైతన్యకు సంబంధించిన మరో విషయాన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు కుర్రాళ్ళు. నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ప్రేమాయణం నడుపుతున్నాడని వీళ్ళు డేటింగ్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీనికి తగ్గట్టే అప్పుడప్పుడు ఈ జంట మీడియాకు అడ్డంగా దొరికిపోతున్నారు. గతంలో చాలా సార్లు వీళ్ళిద్దరూ పక్కపక్కనే ఫొటోస్ దిగుతూ ఒకే రెస్టారెంట్లో ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తూ చాలా సార్లు మీడియా కంటే కనపడి సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కు బుక్ అయిపోయారు .
రీసెంట్గా అలాగే మరోసారి శోభిత ధూళిపాల నాగచైతన్య ఫ్యాన్స్ కు అడ్డంగా దొరికిపోయారు . ఆయన రీసెంట్గా గ్రీన్ లైట్స్ అనే పుస్తకం గురించి చెప్తూ.. “జీవితానికి ఒక ప్రేమ లేఖ .. మీ ప్రయాణాన్ని మాతో పంచుకున్నందుకు మాథ్యూ మాక్కనౌగే చాలా థాంక్స్ .. ఈ పఠనం నాకు గ్రీన్ లైట్ ను నింపింది.. రెస్పెక్ట్ సర్” అని చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా అదే బుక్ ను శోభితా షేర్ చేస్తూ.. “గత కొన్ని నెలల్లో నేను చదివిన అత్యుత్తమ పుస్తకం. ఎంత అపురూపమైన జీవిత కథ. ఒక పాట లాగా, నిజంగా. విపరీతమైన నవ్వు మరియు స్వాతంత్య్రాన్ని సంపాదించిన రుచిలా ఉంది” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో వీళ్ల మధ్య లవ్ ఉంది అంటూ మరోసారి నెట్టింట వీళ్ల పిక్స్ వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్..!!