Movies"శభాష్..మెగా కోడలు పిల్ల"..లావణ్య త్రిపాఠి చేసిన పనికి మెగా ఫ్యాన్స్ ఫిదా..!!

“శభాష్..మెగా కోడలు పిల్ల”..లావణ్య త్రిపాఠి చేసిన పనికి మెగా ఫ్యాన్స్ ఫిదా..!!

ఎస్ ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఇదే న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మెగా కోడలు కాబోతున్న లావణ్య త్రిపాఠి ఒక్క దెబ్బతో మెగా ఫాన్స్ ను ఆకట్టుకునేసింది.. మెగా కుటుంబ సభ్యులు కూడా లావణ్య త్రిపాఠి చేసిన పనికి ఫిదా అయిపోతున్నారు . అంతలా లావణ్య త్రిపాఠి ఏం చేసిందో తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే..

మనకు తెలిసిందే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ – హీరోయిన్ లావణ్య త్రిపాఠి జూన్ 9వ తేది నాగబాబు నివాసంలో గ్రాండ్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఫైనల్లి తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పి ఒప్పించి .. పెళ్లికి రెడీ అయ్యారు. నవంబర్ ఒకటవ తేదీ వీళ్ళ పెళ్లి గ్రాండ్గా ఇటలీలో జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఇలాంటి క్రమంలోనే లావణ్య త్రిపాఠి తీసుకున్న నిర్ణయం అభిమానులకి ఫుల్ నచ్చేసింది . లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత సినిమాలను ఆపేయబోతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే అదంతా ఫేక్ అని ఆమె కొన్ని సినిమాలకు సైన్ చేసిన అప్డేట్స్ అఫీషియల్ గా ప్రకటించింది.

కాకపోతే రీసెంట్గా లావణ్య త్రిపాఠి ముందు కమిట్ అయిన ప్రాజెక్టును క్యాన్సిల్ చేసేసిందట . తిరిగి రెమ్యూనరేషన్ డబ్బులను కూడా వెనక్కి ఇచ్చేసిందట . దానికి కారణం ఆ పాత్రలో బోల్డ్ గా కనిపించాల్సి ఉండడమే. మెగా ఇంటికి కోడలు కాబోతున్న లావణ్య త్రిపాఠి అలాంటి బోల్డ్ పాత్రలో కనిపిస్తే అత్తగారింటి పరువు కి భంగం కలిగించిన కలిగించినట్లు అవుతుందని భావించిన లావణ్య త్రిపాఠి మేకర్స్ కి ఉన్న విషయం ఓపెన్ గా చెప్పేసి రెమ్యూనరేషన్ డబ్బులు కూడా వెనక్కి ఇచ్చేసిందట. తమిళ్లో వెబ్ సిరీస్ చేసేందుకు కొన్ని నెలల ముందే లావణ్య ఓకే చేశారు . అడ్వాన్స్ డబ్బులు కూడా తీసుకున్నారు . అయితే మరికొద్ది రోజుల్లో ఆ వెబ్ సిరీస్ సెట్స్ పైకి వెళ్తూ ఉండగా లావణ్య ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అభిమానులు ఫుల్ ఫిదా అయిపోయారు. దీంతో లావణ్య త్రిపాఠి ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news