టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబు వారసుడిగా మంచు విష్ణు 2003లో విష్ణు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకు ప్రముఖ మలయాళ దర్శకుడు షాజీ కైలాస్ దర్శకత్వం వహించారు. విష్ణుకు జోడిగా అప్పుడు స్టార్ హీరోయిన్గా ఉన్న సాక్షి శివానంద్ చెల్లెలు శిల్పా శివానంద్ నటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ టైంలో శిల్పా శివానంద్ షూటింగ్ కు లేటుగా రావడంతో పాటు చుక్కలు చూపించేసిందట.
అప్పటికే మంచు విష్ణుకి అది కొత్త సినిమా నిర్మాత మోహన్ బాబుతో పాటు దర్శకుడు అందరూ టెన్షన్ గా ఉన్నారు. అలాంటి టైంలో హీరోయిన్ శిల్ప షూటింగ్ లేటుగా రావడంతో పాటు అనేక కండిషన్లు పెట్టి యూనిట్‌ను బాగా ఇబ్బందులకు గురిచేసిందట. చివరకు మోహన్ బాబు కూడా ఆమెకు చాలాసార్లు సర్ది చెప్పేందుకు ట్రై చేశారట. పైగా శిల్ప అక్క సాక్షి శివానంద్ మోహన్ బాబుతో అప్పటికే సినిమాలలో కూడా నటించింది.
అయితే సహనం నశించిన మోహన్ బాబు శిల్పాపై కోప్పడడంతో పాటు చేయి కూడా చేసుకున్నారన్న ప్రచారం అప్పట్లో బయటకు వచ్చింది. చివరకు శిల్ప అక్క సాక్షి శివానంద్ తో పాటు ఇండస్ట్రీ జనాలు సర్ది చెప్పడంతో ఈ గొడవ అక్కడితో ముగిసిందని టాక్.
ఆ తర్వాత శిల్పా శివానంద్ తెలుగులో హీరోయిన్గా నిలదొక్కుకోలేదు. తొలి సినిమా తోనే ఆమెపై బ్యాడ్ టాకు రావడంతో ఆమెను హీరోయిన్గా తీసుకునేందుకు ఎవరు ఇష్టపడలేదు. అలా శిల్పా కెరీర్ విష్ణుతోనే ముగిసిపోయింది.