సినిమా ఇండస్ట్రీలో కొందరు డైరెక్టర్ సాహసాలు చేస్తూ ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే . ఎప్పుడు ఒకటే కంటెంట్ ఫాలో అవ్వకుండా హీరోని ఏ విధంగా చూపిస్తే అభిమానులు లైక్ చేస్తారు.. క్రేజ్ వస్తుంది.. పబ్లిసిటీ వస్తుంది అన్న విషయాలలో ఎక్కువగా లీనమైపోతూ ఉంటారు . అలాంటి లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు స్టార్ట్ డైరెక్టర్ సుకుమార్ . ఏ హీరోనైనా సరే డిఫరెంట్ యాంగిల్ లో చూపించడంలో డైరెక్టర్ సుకుమార్ తర్వాతే మరి ఏ డైరెక్టర్ అయినా అని చెప్పుకోవాలి .
కాగా అలాంటి సుకుమార్ మహేష్ బాబుని ఏకంగా న్యూడ్ గా తెరపై చూపించడానికి ట్రై చేశారట . ఆ సినిమా మరేదో కాదు ..పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన పుష్ప . ఎస్ మనకు తెలిసిందే పుష్ప సినిమాల్లో మొదటిగా అల్లు అర్జున్ ప్లేస్ లో మహేష్ బాబును ఊహించుకున్నారు డైరెక్టర్ సుకుమార్ . అయితే ఇంతటి మాస్ కంటెంట్ తన బాడీకి సూట్ అవ్వదని . మహేష్ బాబు ఈ కథను సున్నితంగా రిజెక్ట్ చేశాడు అన్న వార్తలు వినిపించాయి. అయితే ఈ సినిమాలో లాస్ట్ సీన్ లో బన్నీ – విలన్ ఫహెద్ ఫజిల్ కేవలం అండర్ వేర్ తో ఫైట్ చేసిన సీన్ హైలెట్ గా మారింది.
నిజానికి ఈ ప్లేస్ లో మహేష్ బాబు ఉండాలి. మహేష్ బాబుని అలా చూపించడానికి కథను రాసుకున్నాడు డైరెక్టర్ సుకుమార్ . అయితే కథను విన్నప్పుడు నమ్రతకు సైతం ఇదే సీన్ కొంచెం అన్ కన్వీనెంట్గా అనిపించిందట . ఇప్పటివరకు మహేష్ బాబు అలాంటి లుక్స్ లో తెరపై కనిపించనేలేదు . మరి అలా కనిపిస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారా ..? అన్నది కూడా నమ్రత మైండ్ లో తట్టిందట . అయితే సుకుమార్ కి పరోక్షకంగానే కౌంటర్ వేసిందట . ఒక సీన్ రాసేటప్పుడు ఫ్యాన్స్ ని కూడా దృష్టిలో పెట్టుకొని రాసుకోవడం చాలా మంచిది సార్ అంటూ దెబ్బ కొట్టకనే కొట్టిందట . అయినా సరే మహేష్ బాబు ఈ పాత్రను ముందుగానే రిజెక్ట్ చేయాలి అనుకున్నారట. ఇంత మాస్ కంటెంట్ ఆయనకు సెట్ అవ్వకపోవడం ప్రధాన కారణంగా తెలుస్తుంది . ఏ మాటకు ఆ మాట ఈ పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ తప్పిస్తే మరి ఏ హీరోని మనం ఊహించుకోలేం..!!