Moviesశ్రీదేవికి ఉన్న వింత అలవాటే..జాన్వీ కి కూడా ఉందా ..? బోనీకపూర్...

శ్రీదేవికి ఉన్న వింత అలవాటే..జాన్వీ కి కూడా ఉందా ..? బోనీకపూర్ బలి..!!

సాధారణంగా తల్లిదండ్రులకు ఉండే అలవాట్లు పోలికలు పిల్లలకు వస్తూ ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే.. అయితే ఇప్పుడు అలా వారసత్వంగా వచ్చిన ఓ వింత అలవాటు జాన్వికపూర్ కు పెద్ద సమస్య తీసుకొచ్చింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అతిలోకసుందరిగా పేరు సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వికపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది. ఒక హిట్టు కొట్టకపోయినా సరే ఆ స్టార్ స్టేటస్ ను అలానే కంటిన్యూ చేస్తున్న జాన్వికపూర్ తెలుగులో మాత్రం కచ్చితంగా హిట్ కొడుతుంది అన్న ధీమా వ్యక్తం చేస్తుంది. ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న దేవరాజు సినిమాలో జాన్వికపూర్ మొదటి హీరోయిన్గా సెలెక్ట్ అయింది.

కాగా ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే తెలుగులో రెండో సినిమాకి సైతం సైన్ చేసింది అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . ఇలాంటి క్రమంలోనే తల్లికి ఉన్న వింత అలవాటే జాన్వికపూర్ కూడా వచ్చింది అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . నిజానికి శ్రీదేవి చాలా యూనిక్యూ.. చాలా ట్రెడిషనల్ .. అన్ని రంగాలలోనూ ఆమె ముందుండాలని ఏ ఈవెంట్లో అయినా ఏ ఫంక్షన్ లో నైనా తన తర్వాతే వేరే వాళ్ళు ఉండేలా అట్రాక్టివ్ నెస్ ని ఎక్కువగా చూపించుకుంటుంది .

అయితే సినిమాలో కూడా అదే ఎక్కువగా ఫాలో అవుతుంది శ్రీదేవి. ఆ సినిమాలో ఎవరైనా ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారంటే కచ్చితంగా శ్రీదేవిని టాప్ లో చూపించాల్సిందే.. అలాంటి ఓ మొండి పట్టుదల పడుతుంది. అయితే ప్రజెంట్ జాన్వికి సైతం అలాంటి అలవాటులే వచ్చాయట. ఏ ఫంక్షన్ కి వెళ్ళాలి అన్న ముందు రోజు నుంచే ప్రిపేర్ చేసుకునే జాన్వి అక్కడ ఆ ఈవెంట్లో ఆమె హైలెట్గా నిలవాలని భావిస్తుందట . సినిమా కథ విషయంలో కూడా అంతే ఆమె పాత్ర హైలెట్ గా ఉండాలని అందరి ఫోకస్ ఆమె పాత్ర పైనే ఉండేలా కథను చూస్ చేసుకుంటుందట . దీంతో జనాలు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. అప్పుడు శ్రీదేవి ఇప్పుడు నువ్వు ఇండస్ట్రీని ఏలేస్తున్నారుగా అంటూ కామెంట్స్ చేస్తుంటే …తల్లికి తగ్గ కూతురు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news